లవర్‌ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే! | Jabardasth Naresh Lover In Sridevi Drama Company Promo Latest | Sakshi
Sakshi News home page

Jabardasth Naresh: స్టేజీపైనే ప్రేయసికి ముద్దు పెట్టిన కమెడియన్.. కానీ!

Published Sun, Nov 26 2023 5:21 PM | Last Updated on Wed, Nov 29 2023 1:10 PM

Jabardasth Naresh Lover In Sridevi Drama Company Promo Latest - Sakshi

తెలుగులో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. సినిమాల్లో కావొచ్చు, షోల్లో కావొచ్చు తమదైన హాస్యంతో నవ్విస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అలా 'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన నరేశ్.. అదేనండి పొట్టి నరేశ్. తనదైన శైలిలో కామెడీ చేస్తూ ఫేమ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఓ షోలో భాగంగా తన ప్రేయసిని అందరికీ పరిచయం చేశాడు. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!)

ఇంతకీ ఎవరామె?
టీవీ షోలతో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నరేశ్.. పలు కార్యక్రమాల్లో తనదైన మార్క్ హాస్యంతో నవ్విస్తున్నాడు. హైట్ తక్కువ ఉన్నప్పటికీ అది ఇతడికి ప్లస్ అయిందని చెప్పొచ్చు. తాజాగా ఓ షోలో భాగంగా తన ప్రేమలో ఉన్న విషయాన్ని యాంకర్ రష్మీతో చెప్పుకొచ్చాడు. అలానే అమ్మాయిని స్వయంగా స్టేజీపై తీసుకొచ్చాడు. ఆమె తమ ప్రేమ గురించి బయటపెట్టింది. గత రెండేళ్లుగా ఎక్స్‌ప్రెస్ చేయలేనంత ప్రేమని నరేశ్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది.

అలానే నరేశ్ తన ప్రేయసిని స్టేజీపైకి తీసుకురావడం పక్కనబెడితే.. ప్రపోజ్ చేసి, చేతిపై ముద్దు కూడా పెట్టాడు. అంతా బాగానే ఉంది కానీ ఇదంతా కూడా స్క్రిప్టెడ్ అనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒరిజినల్ అనే ఫీల్ రాలేదు. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని చూసి చూసి ప్రేక్షకులకు ఎప్పుడో బోర్ కొట్టేశాయి. అయినా కూడా షో నిర్వహకులు ఇలానే చేయడంపై నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement