Aamir Khan Daughter Ira Khan Reaction To Trolls On Her Bikini Pics Wearing On Birthday - Sakshi
Sakshi News home page

Trolls On Ira Khan: తండ్రి ముందే బికినీలో కేక్‌ కటింగా? అంటూ ట్రోలింగ్‌.. గట్టి కౌంటరిచ్చిన ఐరా

May 16 2022 12:57 PM | Updated on May 16 2022 1:40 PM

Ira Khan Reaction To Trolls On Her Bikini Pics Wearing On Birthday - Sakshi

నా బర్త్‌డే ఫొటోల మీద మండిపడుతూ ట్రోల్‌ చేయడం అయిపోయిందా? ఎందుకంటే మీకోసం మరికొన్ని ఫొటోలు..' అంటూ మరిన్ని బికినీ ఫొటోలను షేర్‌ చేసింది ఐరా. ఇలా కౌంటరిచ్చిందేంటని ముక్కున వేలేసుకుంటున్నారు ట్రోలర్స్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఐరా ఖాన్‌ ఇటీవల (మే 8న) బర్త్‌డే వేడుకలు జరుపుకుంది. అయితే ఈసారి వెరైటీగా పూల్‌ పార్టీ చేసుకుంది. స్విమ్మింగ్‌ పూల్‌లో నుంచి తడుచుకుంటూ వచ్చిన ఐరా బికినీలోనే కేక్‌ కటింగ్‌ చేసింది. తల్లి రీనా, తండ్రి ఆమిర్‌ ఖాన్‌ల ఎదుటే బికినీలో బర్త్‌డే జరుపుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు ఐరా తీరును తప్పుపడుతూ సోషల్‌ మీడియాలో ఆమెను దుమ్మెత్తిపోశారు. ఆ డ్రెస్‌లో వేడుక చేసుకోవడానికి కొంచెం కూడా సిగ్గు లేదా? అని మండిపడ్డారు. అయితే ఈ కామెంట్లను పెద్దగా పట్టించుకోని ఐరా తన బర్త్‌డేను మాత్రం హ్యాపీగా ఎంజాయ్‌ చేసింది.

తాజాగా తనను ట్రోల్‌ చేసినవారికి గట్టి కౌంటరిచ్చిందామె. 'నా బర్త్‌డే ఫొటోల మీద మండిపడుతూ ట్రోల్‌ చేయడం అయిపోయిందా? ఎందుకంటే మీకోసం మరికొన్ని ఫొటోలు..' అంటూ మరిన్ని బికినీ ఫొటోలను షేర్‌ చేసింది ఐరా. దీంతో షాకైన ట్రోలర్స్‌ ఇలా కౌంటరిచ్చిందేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. దొరికిందే ఛాన్సని నోరు పారేసుకున్నవాళ్లకు భలే ఆన్సరిచ్చావని ఐరాను పొగుడుతున్నారు ఫ్యాన్స్‌.

చదవండి: ఆర్జే కాజల్‌ హోం టూర్‌ వీడియో, దీంట్లో ఓ స్పెషల్‌ ఉంది!

ఖుషి టైటిల్‌తో వస్తున్న విజయ్‌, సామ్‌, ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

Advertisement
 
Advertisement
Advertisement