‘గిల్టీ మైండ్స్’ భామ దీక్షా జునేజా గురించి ఈ విషయాలు తెలుసా?

అమెజాన్ ప్రైమ్ లీగల్ డ్రామా ‘గిల్టీ మైండ్స్’ .. ఇప్పుడు టాక్ ఆఫ్ ది వెబ్‌స్క్రీన్. అందులో ముఖ్య భూమికలో మెరిసిన నటి.. దీక్షా జునేజా. ఆమె వివరాలు కొన్ని ఇక్కడ..
►పుట్టింది పంజాబ్‌లోని రాజ్‌పురాలో. పెరిగింది చండీగఢ్‌లో. తల్లిదండ్రులు.. శశి జునేజా, అశోక్ జునేజా. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదివింది దీక్షా.
► చిన్నప్పటి నుంచే నటన పట్ల ఆసక్తి ఉండడంతో చాలా మంది నటీనటుల్లాగే డిగ్రీ అయిపోగానే యాక్టింగ్‌లో కెరీర్ వెదుక్కోవడానికి ముంబై చేరింది.
►ముందు మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. తర్వాత ‘దిల్ జో న కహ సకా (2017)’తో బాలీవుడ్‌లో పరిచయం అయితే అయింది కానీ పెద్దగా పేరు రాలేదు. అప్పుడే నెట్‌ఫ్లిక్స్ ‘రాజ్మాచావల్’లో చాన్స్ వచ్చింది హీరోయిన్‌గా. ఆ మూవీతో వెబ్ వీక్షకులందరినీ ఆకట్టుకుంది దీక్షా.
► ఆ వెంటనే ‘గర్ల్‌ఫ్రెండ్ చోర్’ అనే వెబ్ సిరీస్‌లోనూ అవకాశం వచ్చింది. చేసింది. అందులోని దీక్షా నటనా దక్షతను బాలీవుడ్ గ్రహించింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో చాన్స్ ఇచ్చి ఆమె ప్రతిభను గౌరవించింది.
►అనంతరం సోనమ్ కపూర్, దుల్కర్ సల్మాన్ నటించిన ‘జోయా ఫ్యాక్టర్’లోనూ ఓ పాత్ర పోషించింది. ఆ సినిమాలో ఆ ఇద్దరితో సమంగా పాపులారిటీని సంపాదించుకుంది. తర్వాత మళ్లీ ‘లవ్, లస్ట్ అండ్ కన్‌ఫ్యూజన్ 2’ అనే వెబ్‌సిరీస్‌లో మంచి రోల్ ఆమెను వరించింది.
► ఇదిగో ఇప్పుడు అమెజాన్ హిట్ సిరీస్ ‘గిల్టీ మైండ్స్’.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఫాలో అవుతున్న ప్రతి గడపను ఆమె ఫ్యాన్‌గా మార్చేసింది. ఆ అభిమానానికి స్పందిస్తూ ‘రెండేళ్ల కరోనా కాలం తర్వాత ప్రేక్షకుల ఆదరాభిమానాలను ఇంతగా ఆస్వాదిస్తున్నది ఈ సిరీస్‌తోనే. ఇది జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం.. థాంక్యూ.. ’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
► తీరిక వేళల్లో స్విమ్మింగ్, డాన్స్, ట్రావెలింగ్‌ను ఇష్టపడుతుంది దీక్షా.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు