దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్.. ఆ బుల్లితెర నటి ఎవరంటే? | Sakshi
Sakshi News home page

TV actress: బుల్లితెరపై అత్యధిక పారితోషికం ఆమెకే.. ఏడేళ్ల వయసులోనే!

Published Thu, Jan 11 2024 7:44 PM

Indias richest TV actress started working at seven Years - Sakshi

సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్‌ అనే మాట  ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ఎందుకంటే స్టార్ హీరోల విషయాకొనిస్తే ఆ పదం కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోలు కూడా ఉన్నారు. అలాగే సినిమాలతో పాటు బుల్లితెరపై కనిపించే నటీనటులు సైతం కోట్లలో కాకపోయినా.. లక్షల్లో తీసుకునేవారు ఉన్నారు. బుల్లితెరపై నటీనటుల విషయంలో రెమ్యునరేషన్‌ తక్కువే అయినా.. అందులోనూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్‌కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్న క్రేజీ నటి గురించి తెలుసుకుందాం. ఇంతకీ ఆమె ఎవరో మీరు కూడా ఓ లుక్కేయండి.

ఏడేళ్ల వయసులోనే  చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన నటి ప్రస్తుతం బుల్లితెరపై నటించేవారిలో అత్యధిక పారితోషికం అందుకుంటోంది. ప్రముఖ సీరియల్స్‌లో నటిస్తూ ఒక్కో ఎపిసోడ్‌కు హైయ్యెస్ట్‌ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆమె దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బుల్లితెర భామ రూపాలీ గంగూలీ. దర్శకుడు, స్క్రీన్ రైటర్ అనిల్ గంగూలీ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె సోదరుడు విజయ్ గంగూలీ కూడా కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. 

రూపాలి గంగూలీ 1985లో ఏడేళ్ల వయసులో తన తండ్రి చిత్రం సాహెబ్‌లో నటించింది. ఆ తర్వాత ఆమె 2000లో సుకన్య అనే సీరియల్‌తో బుల్లితెర రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌లో మోనిషా పాత్రకు ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2006లో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్- 1లో పాల్గొంది. ఆ తర్వాత కూడా పలు రియాలిటీ షోస్‌లో కూడా పాల్గొంది. ఆమెకు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్‌తో సన్నిహితమైన సంబంధాలు కూడా ఉన్నాయి. అక్షయ్ కుమార్‌ను కుటుంబ సభ్యుడిలా భావిస్తామని గతంలో రూపాలీ చాలాసార్లు చెప్పుకొచ్చారు. 

సీరియల్స్‌లో నటిస్తూ ఉండగానే రూపాలి గంగూలీ ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ కె. వర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అనుపమ-నమస్తే అమెరికా, బతేన్ కుచ్ అంకాసీ అనే సీరియల్స్‌లో నటిస్తోంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లితెర నటిగా పేరు సంపాదించుకున్న రూపాలీ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బుల్లితెర నటిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 3 లక్షలు తీసుకుంటోంది. కేవలం సీరియల్స్‌ ద్వారానే దాదాపు  రూ. 20 కోట్ల వరకు ఆస్తులు సంపాదించారు. బుల్లితెర పరంగా చూస్తే ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ రూపాలీ గంగూలీ అందుకుంటున్నారు.  

ఓవరాల్‌గా ఇండియాలో ఈ స్థానం మాత్రం కమెడియన్ కపిల్ శర్మదే. అతడు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.50 లక్షలు వసూలు చేస్తుండటం విశేషం. బాలీవుడ్ లోనూ అతడు పలు సినిమాల్లో కనిపించాడు. ది కపిల్ శర్మ షో మాత్రం చాలా ఫేమస్ అయ్యారు. సంపద పరంగా చూస్తే రూపాలీ గంగూలీ కంటే హీనా ఖాన్ నెట్ వర్త్ చాలా ఎక్కువ. ఆమె రూ.52 కోట్లతో దేశంలో అత్యధిక సంపద కలిగిన బుల్లితెర నటిగా నిలిచింది. 

Advertisement
 
Advertisement