బిజీ బిజీగా మన స్టార్‌ హీరోయిన్లు..

Indian Heroines Latest Projects Full Details in Telugu - Sakshi

హీరోలు ఒకేసారి ఒకటీ రెండు సినిమాలు మాత్రమే చేస్తుంటారు. హీరోయిన్లు ఏకకాలంలో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తారు హీరోయిన్లు. ఉదయం ఓ సినిమా – మధ్యాహ్నం మరో సినిమా – సాయంత్రం ఇంకో సినిమా.. ఇలా ఆ సెట్‌కీ ఈ సెట్‌కీ తిరుగుతూ షూటింగ్‌ చేస్తుంటారు. ప్రస్తుతం మన స్టార్‌ హీరోయిన్లు చేసున్న సినిమాల వివరాలు చూద్దాం. 

కాజల్‌ అగర్వాల్‌: చిరంజీవితో ‘ఆచార్య’, మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’, హిందీలో జాన్‌  అబ్రహామ్‌తో ‘ముంబై సాగా’, తమిళంలో కమల్‌తో ‘భారతీయుడు 2’, దుల్కర్‌ సల్మాన్‌ తో ‘హే సినామికా’, ‘గోస్టీ’ చిత్రాలు చేస్తున్నారు. 

రకుల్‌ ప్రీత్‌: నితిన్‌ తో ‘చెక్‌’, క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, తమిళంలో శివ కార్తికేయన్‌తో ‘అయలాన్‌’, కమల్‌హాసన్‌తో ‘ఇండియన్‌ 2’, హిందీలో ‘అటాక్, సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌సన్, మే డే, థ్యాంక్‌గాడ్‌’ సినిమాలు చేస్తున్నారు.

తమన్నా: గోపీచంద్‌తో ‘సీటీమార్‌’, నితిన్‌తో ‘అంధా ధున్‌  రీమేక్, సత్యదేవ్‌తో ‘గుర్తుందా శీతాకాలం’, వెంకటేశ్‌తో ‘ఎఫ్‌3’, హిందీలో నవాజుద్దిన్‌  సిద్దిఖీ ‘బోల్‌ చుడియా’ సినిమాలు చేస్తున్నారు. 

శ్రుతీహాసన్‌ : పవన్‌  కల్యాణ్‌తో ‘వకీల్‌ సాబ్‌’, ప్రభాస్‌తో ‘సలార్‌’, తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘లాభం’ సినిమాలు చేస్తున్నారు. 

సమంత: గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే లేడీ ఓరియంటెడ్‌ సినిమా, తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాదువాక్కుల రెండు కాదల్‌’ సినిమాలు చేస్తున్నారు. 

కీర్తీ సురేష్‌: నితిన్‌ తో ‘రంగ్‌ దే’, మహేశ్‌బాబుతో ‘సర్కారువారి పాట’, గుడ్‌ లక్‌ సఖి, తమిళంలో రజనీకాంత్‌తో ‘అన్నాత్తే’, సాని కాయిదం, మలయాళంలో ‘మరక్కార్‌ : అరబికడలింటే సింహం, వాషి’ చేస్తున్నారు. 

సాయి పల్లవి: నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’, రానాతో ‘విరాటపర్వం’, నానితో ‘శ్యామ్‌ సింగరాయ్‌’, పవన్‌ కల్యాణ్‌తో ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ సినిమాలు చేస్తున్నారు. 

పూజా హెగ్డే: చిరంజీవి ‘ఆచార్య’, ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్‌’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చేస్తున్నారు. 

రష్మికా మందన్నా: అల్లు అర్జున్‌తో ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, తమిళంలో కార్తీతో ‘సుల్తాన్‌’ హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్ను’, అమితాబ్‌ బచ్చన్‌ తో ‘డాడీ’ సినిమాలు చేస్తున్నారు. 

రాశీ ఖన్నా: తెలుగులో గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్‌’ తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘తుగ్లక్‌ దర్బార్‌’, ‘అరన్‌ మణై 3’, మలయాళంలో ‘భ్రమం’ సినిమాలు చేస్తున్నారు. 

అనుష్క: ఒకే ఒక్క సినిమా కమిట్‌ అయ్యారు. ‘రారా కృష్ణయ్య’ దర్శకుడు మహేశ్‌ పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 

మరికొందరు
‘స్కై ల్యాబ్‌’, ‘నిన్నిలా నిన్నిలా’ చేస్తున్నారు నిత్యామీనన్‌  . ‘ఉప్పెన’ ఫేమ్‌ కృతీ శెట్టి చేతిలో నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’, సుధీర్‌బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమాలు ఉన్నాయి. ‘వరుడు కావలెను’, ‘టక్‌ జగదీష్‌’, నిన్నిలా నిన్నిలా’ సినిమాలు చేస్తున్నారు రీతూ వర్మ. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్‌’, ‘చావు కబురు చల్లగా’ సినిమాలు చేస్తున్నారు లావణ్యా త్రిపాఠి. పవన్‌ కల్యాణ్‌ – క్రిష్‌ సినిమా చేస్తున్నారు నిధీ అగర్వాల్‌. శర్వానంద్‌తో ‘శ్రీకారం’ , తమిళంలో సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు  ప్రియాంకా మోహనన్‌ . నానీతో ‘టక్‌ జగదీష్‌’, సాయితేజ్‌ ‘రిపబ్లిక్‌’ చేస్తున్నారు ఐశ్వర్యా రాజేశ్‌. ‘ఎఫ్‌ 3’ చేస్తున్నారు మెహరీన్‌.. ‘అంధా ధున్‌ ’ రీమేక్‌లో నటిస్తున్నారు నభా నటేశ్‌. ‘సిద్ధా ఇదేం లోకం నాయనా’, ‘కళియుగం’  సినిమాలు చేస్తున్నారు శ్రద్ధా శ్రీనాథ్‌.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top