
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja) ప్రస్తుతం పెద్దగా సినిమాలేం చేయట్లేదు. కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. దానికి కారణం.. తన పాటల్ని అనుమతి లేకుండా ఉపయోగించారని పలువురు నిర్మాణలు నోటీసులు పంపడమే దీనికి కారణం.
(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!)
గతంలో మంజుమ్మెల్ బాయ్స్, కూలీ తదితర చిత్రాలకు నోటీసులు పంపిన ఇళయరాజా.. ఇప్పుడు అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) నిర్మాతలకు నోటీసులు పంపించారు. ఏకంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 7 రోజుల్లోగా తనకు క్షమాపణ చెప్పాలని కూడా పేర్కొన్నారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో చాలావరకు పాత పాటల్ని.. వింటేజ్ ఫీల్ కోసం ఉపయోగించారు. అవి బాగానే వర్కౌట్ అయ్యాయి కూడా. అయితే తాము అన్ని అనుమతులు తీసుకునే పాటల్ని ఉపయోగించామని మూవీ టీమ్ అంటోంది. మరి ఈ వివాదం ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)