ఇద్దరు లెజండరీ పర్సన్స్‌​ క్రియేట్‌ చేసిన సాంగ్‌.. చూశారా | Ilaiyaraaja And MM Keeravani Song Composed For Shashtipoorthi Movie | Sakshi
Sakshi News home page

'లేడీస్‌ టైలర్‌' తర్వాత 'షష్టి పూర్తి' కోసం వస్తున్న రాజేంద్రప్రసాద్, అర్చన

Mar 25 2025 12:26 PM | Updated on Mar 25 2025 12:39 PM

Ilaiyaraaja And MM Keeravani Song Composed For Shashtipoorthi Movie

'లేడీస్‌ టైలర్‌' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి  నటించిన చిత్రం 'షష్టి పూర్తి'.. తాజాగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇప్పటికే ఎన్నో పాటలకు మ్యూజిక్‌ అందించడమే కాకుండా రచయితగా కూడా కీరవాణి గుర్తింపు తెచ్చకున్నారు. అయితే, ఈ సినిమాతో తొలిసారి ఇళయరాజా సంగీతంలో  ఆయన ఈ సాంగ్‌ను రచించడం విశేషం. 

‘షష్టిపూర్తి’ సినిమాలో రూపేష్, ఆకాంక్షా సింగ్‌ జంటగా.. రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించారు. ఈ మూవీని పవన్‌ ప్రభ దర్శకత్వంలో రూపేష్‌ చౌదరి నిర్మించారు. ‘లేడీస్‌ టైలర్‌’ తర్వాత ఈ చిత్రంలో వారిద్దరూ మరోసారి నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తికలిగించేలా ఉంది. తాజాగా విడుదలైన సాంగ్‌ రూపేష్, ఆకాంక్షా సింగ్‌ మధ్యే ఉంటుంది. మంచి లవ్‌ ట్రాక్‌తో పాటు చక్కటి మెలోడీనిచ్చేలా పాట ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement