ఆ పని చేస్తే నగ్న ఫొటో పంపిస్తా: పోర్న్‌స్టార్‌ ఆఫర్‌! | I Will Send My Photo Who Get Covid Vaccination: American Model | Sakshi
Sakshi News home page

American Model: పైసా తీసుకోకుండా నగ్న ఫొటో పంపిస్తా.. పోర్న్‌ స్టార్‌

Oct 9 2021 5:50 PM | Updated on Oct 9 2021 7:12 PM

I Will Send My Photo Who Get Covid Vaccination: American Model - Sakshi

వాషింగ్టన్‌: అమెరికన్‌ మోడల్‌, పోర్న్‌ స్టార్‌ ​కాజుమీ స్కూవర్ట్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న మగవాళ్లకు ఉచితంగా నగ్న ఫొటో పంపిస్తానని వెల్లడించింది. సాధారణంగా డబ్బులు తీసుకుని అలాంటి ఫొటోలు పంపుతానని, కానీ కరోనా వ్యాక్సిన్‌ క్యాంపెయిన్‌లో భాగంగా పైసా రుసుము తీసుకోవట్లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ ప్రజల జీవితాల్లో ఎంతటి ప్రభావం చూపించిందో మనందరికీ తెలిసిన విషయమే! ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు విడిచారు. అయితే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక పరిస్థితి కాస్త మెరుగుపడింది.

కానీ ప్రజలు టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. దీనికి సెలబ్రిటీలు కూడా మద్దతు తెలిపారు. ఈ క్రమంలో అమెరికన్‌ పోర్న్‌ స్టార్‌ కాజుమీ కూడా ప్రజలను చైతన్యవంతం చేయడానికి వినూత్న అవగాహన కార్యక్రమం ఆరంభించింది. కోవిడ్‌ టీకా వేసుకున్నవారికి నగ్న ఫొటో పంపిస్తానని ప్రకటించింది. వ్యాక్సిన్‌ వేసుకున్న అనంతరం వారి కోవిడ్‌ సర్టిఫికెట్‌ నిజమా? కాదా? చెక్‌ చేశాకే ఫొటోలు పంపిస్తున్నాననంటోంది కాజుమీ. ఏదేమైనా ఆమె చేపట్టిన ఈ వింత ప్రయత్నం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement