Actress Raai Laxmi Reveals About Her Clinical Depression | ఆ టైంలో డిప్రెషన్‌కు లోనయ్యా - Sakshi
Sakshi News home page

ఆ టైంలో డిప్రెషన్‌కు లోనయ్యా : హీరోయిన్

Mar 17 2021 3:52 PM | Updated on Mar 17 2021 6:01 PM

I Went Through Clinical Depression : Heroine Laxmi Raai - Sakshi

తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల తాను కూడా డిప్రెషన్‌కు లోనయ్యానని హీరోయిన్‌ రాయ్‌లక్ష్మి తెలిపింది. ఇటీవలె ఆమె నటించిన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు విషయాలను చర్చించింది. లాక్‌డౌన్‌ అనంతరం చేస్తున్న మొదటి సినిమా కావడంతో చాలా సంతోషంగా అనిపించిందని, చాలా గ్యాప్‌ తర్వాత షూటింగ్‌ సెట్‌లోకి వెళ్లడంతో ఓ కొత్త నటిని అనే భావన కలిగిందని వెల్లడించింది.  ఈ సినిమాలో అత్యాచారం, కాస్టింగ్ కౌచ్ వంటి వేధింపులకు గురైన బాధితులకు అండగా నిలిచి, వారికి న్యాయం చేయడానికి ప్రయత్నించే మహిళగా తన పాత్ర ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా నిజ జీవితంలో తాను కూడా ఎన్నో కష్టాలను భరించాల్సి వచ్చిందని, తన లైఫ్‌లో కూడా బ్యాడ్‌ డేస్‌ ఉన్నాయని చెబుతూ రాయ్‌లక్ష్మీ ఎమోషనల్‌ అయ్యింది. 

'ముఖ్యంగా 2020ని ఎప్పటికీ మర్చిపోను. గతేడాది నవంబర్‌లో క్యాన్స్‌ర్‌ కారణంగా మా నాన్న చనిపోయాడు. నా స్థాయిని మించి ప్రయత్నించినా ఆయన్ని కాపాడుకోలేయకపోయా. నా తండ్రి మరణం​ తర్వాత జీవితంలో ఎన్నోసవాళ్లను ఎదుర్కొన్నాను. వాటి నుంచి బయటపడటానికి కొన్ని నెలలు పట్టింది. ఆ టైంలో ఎంతో ఒత్తడికి లోనయ్యా. సినిమా ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించా. నా మనసు మొత్తం నాన్న దగ్గరే ఉన్నప్పుడు నేనెలా పని చేసుకోగలను? ఆయనకు ఏమవుతుందోనన్న భయం ఓ వైపు వెంటాడుతున్నా,ఆయన ఆరోగ్యం బాగుండాలని రోజూ దేవుణ్ని ప్రార్థించేదాన్ని. ప్రతిరోజూ నా ఫోన్‌లో డాక్టర్స్‌ నెంబర్స్‌, మెడికిల్‌ బిల్స్‌, చెక్‌ అప్‌కి సంబంధించి రిపోర్ట్స్‌ ఉండేవి. ఒక్కసారిగా నా జీవితం మారిపో​యింది' అంటూ రాయ్‌లక్ష్మీ పేర్కొంది. 


చదవండి : (ఆ బుక్‌ ఎన్నో తరాలను పరిచయం చేస్తుంది: ప్రియాంక)
(రియల్‌ లైఫ్‌లో ఓసారి మోసపోయాను: కాజల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement