రియల్‌ లైఫ్‌లో ఓసారి మోసపోయాను: కాజల్‌

Kajal Aggarwal Speech At Mosagallu Movie Pre Release Event - Sakshi

‘‘పెళ్లయ్యాక మహిళలపై నాకు మరింత గౌరవం పెరిగింది. ఒక మహిళగా నాకు సంతోషంగా ఉంది. మహిళలు మల్టీటాస్కింగ్‌ చేస్తున్నారు. మా అమ్మ కష్టం ఏంటో పెళ్లి చేసుకున్న తర్వాత నాకు తెలిసొచ్చింది’’ అని అన్నారు కాజల్‌ అగర్వాల్‌. మంచు విష్ణు, కాజల్, సునీల్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో జెఫ్రీ గీ చిన్‌  దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మోసగాళ్ళు’. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌ చెప్పిన విశేషాలు.

►అను, అర్జున్‌ అనే అక్కాతమ్ముళ్ల కథే ‘మోసగాళ్ళు’ చిత్రం. ముంబయ్‌ మురికివాడల నుంచి వచ్చిన సిస్టర్‌ అండ్‌ బ్రదర్‌ అమెరికాలో ఎలా స్కామ్‌ చేశారన్నది ప్రధానాంశం. దర్శకుడు జెఫ్రీ చెప్పిన ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే సినిమాలో విష్ణుకు అక్క పాత్ర చేశాను. ‘మోసగాళ్ళు’ సినిమా నిర్మాణ విలువలు బాగుంటాయి. సునీల్‌ శెట్టిగారి కాంబినేషన్‌లో నాకు పెద్దగా సీన్స్‌ లేవు. నవదీప్, నవీన్‌ చంద్రలతో కొన్ని సీన్స్‌ ఉన్నాయి. హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీతో వర్క్‌ చేయడం న్యూ అండ్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. మోహన్‌బాబుగారి వంటి లెజండరీ యాక్టర్‌ సినిమా చూసి విష్ణు, నా యాక్టింగ్‌ను మెచ్చుకున్నారంటే సంతోషంగా ఉంది. రియల్‌ లైఫ్‌లో ఓసారి ఆన్‌లైన్‌లో నేను మూడు వేల రూపాయలు మోసపోయాను. అప్పుడు మా నాన్నగారు కోప్పడ్డారు. ఇలాంటి ఘటనలు రెండు మూడు జరిగాయి.

►గౌతమ్‌ (కాజల్‌ భర్త) గురించి మా ఇంట్లో, నా గురించి గౌతమ్‌ ఇంట్లో తెలుసు. లాక్‌డౌన్‌లో పెళ్లి గురించి ముందు నేనే మా ఇంట్లో చెప్పాను. ఆ తర్వాత గౌతమ్‌ వాళ్లు వచ్చి మా ఇంట్లోవాళ్లతో మాట్లాడారు. ఉదయాన్నే గౌతమ్‌ గురించి మా ఇంట్లో చెప్పి, మధ్యాహ్నం గౌతమ్‌ను రమ్మన్నాను. గౌతమ్‌ నాకు పదేళ్లుగా తెలుసు. మా స్నేహమే పెళ్లిగా మారింది. పెళ్లి జరిగిన వారానికే సినిమా సెట్స్‌కు వచ్చాను. నా సినిమా సెట్స్‌కు గౌతమ్‌ వచ్చాడు. హీరోల్లో గౌతమ్‌కు చరణ్, తారక్‌ అంటే ఇష్టం. హీరోయిన్స్‌లో నేనే ఇష్టం.. ఆప్షన్‌ లేదు (నవ్వుతూ). 

►నాకు రిస్క్‌ తీసుకోవడం ఇష్టమే. ‘సీత, అ!’ సినిమాల్లో డిఫరెంట్‌ రోల్స్‌ చేశాను. ఇప్పుడు ‘మోసగాళ్ళు’  చేశాను. ఇందులో నేను కథ రీత్యా స్మోక్‌ చేస్తాను. నిజానికి నాకు స్మోకింగ్‌ పడదు. ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇన్‌హేలర్‌ వాడాను. నెగటివ్‌ రోల్స్‌ చేయడానికి ప్రాబ్లమ్‌ లేదు. కానీ కథ ఎగ్జయి టింగ్‌గా ఉండాలి. ఎక్స్‌ట్రీమ్‌ బోల్డ్‌ సీన్స్‌లో నటించాలా? లేదా అనేది నా నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ రూల్స్‌ ఎలా ఉన్నా.. నాకంటూ ఓ సెల్ఫ్‌ సెన్సార్‌ ఉంది. 

►చిరంజీవిగారి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాను. నాగార్జునగారితో ఓ సినిమా చేయాల్సి ఉంది. తమిళంలో ‘గోస్టీ’తో పాటు మరో సినిమా కమిటయ్యాను. ‘ఇండియన్‌ 2’ ప్రస్తుతానికి ఆగిపోయింది. నేను హోస్ట్‌గా ఓ వెబ్‌ షో ఉండొచ్చు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Author:
కె. రామచంద్రమూర్తి



 

Read also in:
Back to Top