హాలీవుడ్‌ డైరెక్టర్‌తో కలిసి ఢిల్లీలో ఆసుపత్రి నిర్మాణం : నటి

Huma Qureshi To Launch Hospital Facility To Fight Covid - Sakshi

ఢిల్లీ : భారత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. బెడ్లు దొరక్క, ఆక్సిజన్‌ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్‌ రోగులకు చికిత్స అందించడానికి బాలీవుడ్‌ బ్యూటీ హ్యూమా ఖురేషి ముందుకు వచ్చారు. ఢిల్లీలో ఆక్సిజన్‌ ప్లాంటుతో పాటు 100 పడకల హాస్పిటల్‌ను కట్టిస్తామని ప్రకటించింది. హాలీవుడ్‌ దర్శకుడు జాక్‌ స్నైడర్‌తో కలిసి తాత్కలిక ఆసుపత్రి సదుపాయాన్ని కల్పిస్తానని పేర్కొంది. ఇందుకోసం  సేవ్‌ ది చిల్ర్డన్‌ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది.

అదే విధంగా కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స అందించడానికి వీలుగా స్పెషల్‌ కిట్స్‌ అందిస్తామని, రోగి కోలుకునేవరకు వారితో డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండేలా చేస్తామని వెల్లడించారు. ఇందుకు మీ అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. భారత్‌లో కోవిడ్‌ కేసులు, వైద్యం అందక ప్రజలు పడుతున్న వేధనను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని తెలిపింది. తన వంతుగా వారికి సహాయం చేసేందుకు అండగా నిలబడతానని వివరించింది. ఇక హాలీవుడ్‌లో జాక్‌ స్నైడర్‌ డైరెక‌్షన్‌లో తాను నటించిన 'ఆర్మీ ఆఫ్ ది డెడ్' చిత్రం మే 14న థియేటర్స్‌లో, 21న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుందని తెలిపింది. 

చదవండి : కోవిడ్‌తో కాదు..సరైన వైద్యం అందక చనిపోయారు : మీరా చోప్రా
వారిని క్షమాపణలు కోరిన సల్మాన్‌ ఖాన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top