Prabhas Salaar: Know About Shruthi Haasan Salaar Movie Remuneration - Sakshi
Sakshi News home page

సలార్‌ : శృతి హాసన్‌కు భారీ రెమ్యునరేషన్‌!

Jan 30 2021 12:46 PM | Updated on Jan 30 2021 2:53 PM

Highest Remuneration For Shruti Hassan In Salaar Movie - Sakshi

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ మూవీ ‘సలార్‌’. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్‌ నటించనున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో తొలుత దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుందన్న టాక్‌ నడిచింది.. కానీ అనూహ్యంగా శృతి హాసన్‌ పేరు పరిశీలనలోకి రాగా ఆమెను ఫైనలైజ్‌ చేశారు. ఇందుకోసం ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన శృతి ఈ మధ్య కాలంలో  అందుకుంటున్న అతి పెద్ద పారితోషికం ఇదేనని తెలుస్తోంది. ఈ సినిమాతో హిట్‌ కొడితే ఆమె రెమ్యునరేషన్‌ కూడా భారీగా పెంచే ఆలోచనలో ఉందట. (నేను ‘గే’‌ని.. విడాకులు తీసుకుంటున్నాం: నటుడు)

కాగా 2016లో లండన్‌ నటుడు మైఖేల్‌ కర్సెల్‌తో శృతి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల విరిద్దరూ విడిపోయారు.  అప్పటి నుంచి కాస్తా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన శృతి మళ్లీ తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. ఇటీవల మాస్‌ మహారాజా రవితేజతో నటించిన ‘క్రాక్’‌ చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా హిట్‌తో  ఫుల్‌ జోష్‌లో ఉన్న శృతి ఇటీవల తన 35వ పుట్టిన రోజును స్నేహితులు మధ్య సెలబ్రెట్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శృతి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్‌ చేశారు. దీంతో ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. (మళ్లీ ప్రేమలో శృతి.. అతడే బాయ్‌ఫ్రెండ్‌! )

Advertisement
 
Advertisement
Advertisement