నేను ‘గే’‌ని.. విడాకులు తీసుకుంటున్నాం: నటుడు

Elliot Page Files for Divorce From Emma Portner A Month After Coming Out as a Trans Man - Sakshi

హాలీవుడ్ నటులు, దంపతులు ఎమ్మా పోర్ట్‌నర్, ఇలియట్ పేజ్ విడాకులు తీసుకోబోతున్నారు. మూడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నట్లు ఈ జంట వెల్లడించారు. మ్యాన్‌హట్టన్‌ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశామన్నారు. ఈ సందర్భంగా పేజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఎంతో సుదీర్ఘ ఆలోచనలు.. చర్చ తర్వాత మేం ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. మేం విడాకులు తీసుకుని విడివిడిగా బతకాలని నిర్ణయించుకున్నాం. కానీ మా మధ్య స్నేహం, ఒకరి పట్ల ఒకరికి గౌరవం అలానే కొనసాగుతాయి. మేం బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉంటాం’’ అంటూ ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఏడాది పాటు డేటింగ్‌ అనంతరం 2018లో ఈ జంట వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు గోప్యంగా ఉంచిన ఈ విషయాన్ని  తర్వాత వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక మూడేళ్ల వివాహ బంధానికి విడాకులతో ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించారు. (విడాకులు తీసుకోబోతున్న స్టార్‌ కపుల్‌)

ఇక పేజ్‌ 2014లోనే తాను గేనని ప్రకటించారు. తాజాగా పేజ్‌ తనను తాను ట్రాన్స్‌మ్యాన్‌గా అంగీకరించారు. గతేడాది డిసెంబర్‌లో తనను తాను ట్రాన్స్‌ మ్యాన్‌గా గుర్తించానని.. తనకు మద్దతుగా ఉన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు పేజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన నమ్మశక్యం కాని వ్యక్తులందరికి కృతజ్ఞతలు. నేను ఎవరనేది గుర్తించాను. నన్ను నేను గొప్పగా ప్రేమిస్తున్నాను. నా పట్ల నాకున్న ఈ ప్రేమ ఎంత గొప్పదో వ్యక్తపర్చడానికి మాటలు చాలవు’’ అంటూ పేజ్‌ పోస్ట్‌ చేశారు. ఈ సమయంలో ఎమ్మా పోర్టనర్‌ పేజ్‌కి మద్దతు తెలిపారు. ‘‘పేజ్‌ లాంటి వ్యక్తులు దేవుడిచ్చిన బహుమతి.. వారిని గౌరవించాలి.. వారి ప్రైవసీకి భంగం కలిగించకూడదు’’ అంటూ సపోర్ట్‌ చేశారు. ఇలా ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే వారు విడాకులు తీసుకోవడం గమనార్హం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top