Actress Mehreen Pirzada New Look Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Mehreen Pirzada: షాకింగ్‌ లుక్‌లో హీరోయిన్‌ మెహ్రీన్‌.. ఇలా మారిపోయిందేంటి?

May 4 2023 11:19 AM | Updated on May 4 2023 12:37 PM

Heroine Mehreen Pirzada New Look Photos Goes Viral - Sakshi

ఇండస్ట్రీలో టాలెంట్‌ ఎంత ఉన్నా అందం కూడా అంతే ముఖ్యం. అందుకే హీరో,హీరోయిన్లు ఫిట్‌నెస్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జిమ్‌లో గంటల కొద్దీ వర్కవుట్స్‌ చేస్తూ అందాన్ని కాపాడుకుంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు బొద్దుగా మెస్మరైజ్‌ చేసే బ్యూటీలు ఇప్పుడు జీరో సైజే సో బెటర్‌ అంటున్నారు.

చదవండి: కమెడియన్‌ మనోబాల మృతికి కారణం ఇదేనా?.. ఆ వ్యసనం వల్లేనా?

తాజాగా ఈ లిస్ట్‌లో మెహ్రీన్‌ కూడా చేరింది. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్‌ ఈ మధ్యకాలంలో బాగా సన్నబడింది.

వర్కవుట్స్‌, డైట్‌ పాటిస్తూ జీరో సైజ్‌కి వచ్చేసింది. లేటెస్ట్‌గా తన లుక్‌కి సంబంధించిన ఫోటోలను మెహ్రీన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇది చూసి.. మెహ్రీన్‌కు ఏమైంది ఇంత సన్నబడింది? అయినా ఒకప్పటిలా బొద్దుగా ఉంటేనే బాగుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. చదవండి: గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్‌మన్‌ కుటుంబానికి ఆర్థికసాయం

Advertisement
 
Advertisement
Advertisement