ఆ విషయంలో అనుమానమే లేదు: సుహాస్‌ | Hero Suhas Talk About Writer Padmabhushan | Sakshi
Sakshi News home page

Writer Padmabhushan: ఆ విషయంలో అనుమానమే లేదు: సుహాస్‌

Jan 27 2023 8:17 AM | Updated on Jan 27 2023 8:17 AM

Hero Suhas Talk About Writer Padmabhushan - Sakshi

‘‘రైటర్‌ పద్మభూషణ్‌’ ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌కి అందరూ కనెక్ట్‌ అవుతారు. మా సినిమా చూసిన ప్రేక్షకులు మంచి సినిమా చేశారని అభినందిస్తారు. ఆ విషయంలో అనుమానమే లేదు’’ అని హీరో సుహాస్‌ అన్నారు. షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో సుహాస్, టీనా శిల్పరాజ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. జి. మనోహర్‌ సమర్పణలో అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజవుతోంది.

సుహాస్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని ట్విస్టులను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌ 2లో నేను నటిస్తున్న సినిమా పూర్తయింది. అలాగే ‘ఆనందరావు 
అడ్వంచర్స్‌’ అనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement