Rudraveena: రుద్రవీణ: శ్రీకాంత్‌ చేతుల మీదుగా ‘బంగారు బొమ్మ’ పాట

Hero Srikanth Launched Bangaru Bomma Song From Rudraveena Movie - Sakshi

మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో శ్రీరామ్‌ నిమ్మల, ఎల్సా గోష్‌, శుభశ్రీ సోనియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కతున్న చిత్రం ‘రుద్రవీణ’. సాయి విల్లా సినిమాస్‌ పతాకంలో రాగుల గౌరమ్మ సమర్పణలో రాగుల లక్ష్మణ్‌, రాగుల శ్రీనులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ​ దశలో ఉన్న ఈచిత్రం నుంచి బంగారు బొమ్మ పాట రిలీజైంది. చిత్ర బృందం సమక్షం​లో నటుడు శ్రీకాంత్‌ హైదరాబాద్‌లో ఈ పాటను లాంచ్‌ చేశాడు.

ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ‘రుద్రవీణ టైటిల్‌ బాగుంది. ఈ టైటిల్‌ మన తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమే. గతంలో అన్నయ్య చిరంజీవి నటించిన రుద్రవీణ మూవీ మంచి మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. అలాంటి గొప్ప టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన బంగారు బొమ్మ పాట విన్నాను. చాలా బాగా నచ్చింది. ఈ పాటతో పాటు ఈ సినిమాలోని అన్ని పాటలు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు.

ఇక చివరిగా ఈ సినిమాకు పని చేసిన టెక్నిషియన్స్‌, ఆర్టిస్టులందరిక ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు.  ఇక నిర్మాతలు మాట్లాడుతూ.. చిరంజీవి గారి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీస్తున్నామన్నారు. ‘మెగా ఫ్యామిలీది గోల్డెన్‌ హ్యాండ్‌ అని ఎలా భావిస్తామో వారి తరువాత శ్రీకాంత్‌ గారిది కూడా అంతే గోల్డెన్‌ హ్యాండ్‌. అలాంటి శ్రీకాంత్‌ గారి చేతుల మీదుగా మా సినిమా తొలి సాంగ్‌ను రిలీజ్‌ అవ్వడం సంతోషంగా ఉంది’ అన్నారు. మహావీర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల, ఎల్సా గోష్ , శుభశ్రీ,, రఘు కుంచె, ధనరాజ్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, సోనియా తదితరులు నటిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top