హాస్పిటల్‌ నుంచి ట్వీట్‌ చేసిన సాయిధరమ్‌ తేజ్‌ | Hero Sai Dharam Tweet From Hospital | Sakshi
Sakshi News home page

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత తొలిసారి సాయి తేజ్‌ ట్వీట్‌

Oct 3 2021 6:35 PM | Updated on Oct 3 2021 7:33 PM

Hero Sai Dharam Tweet From Hospital - Sakshi

Sai Dharam Tej Tweets From Hospital: రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్‌ తేజ్‌ కోలుకుంటున్నారు. తాజాగా ఆయన హాస్పిటల్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి ట్వీట్‌ చేశారు. నాపై, రిపబ్లిక్‌ మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్‌ అన్నది చిన్నపదమే. త్వరలోనే మీ ముందుకు వస్తా అంటూ సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్‌ చేశాడు. ‘థంబ్స్ అప్‌’సింబల్‌ చూపిస్తూ ఓ ఫోటోను ఆయన షేర్‌ చేశారు. దీంతో రూమర్లకు చెక్‌ పెట్టినట్లయ్యింది. చదవండి: డ్రగ్స్‌ కేసులో షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌

గతనెల 10వ తేదీన సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై ఇటీవలి కాలంలో హెల్త్‌ బులెటిన్‌ విడుదల కాలేదు. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సాయితేజ్‌ ట్వీట్‌ మెగా అభిమానుల్లో నూతన ఉత్సాహం నింపింది. కాగా సాయి తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్‌ సినిమా అక్టోబర్ 1న విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. చదవండి: మా ఎన్నికలు: మంచు విష్ణుకు బాలయ్య మద్ధతు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement