
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. నిన్న(శుక్రవారం)గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హర్రర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో కమర్షియల్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. కార్తీక్‌దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయితేజ్‌కు జంటగా సంయుక్తా మీనన్ నటించింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అందుకు తగ్గట్లే వసూళ్లను రాబట్టింది. చాలాకాలం తర్వత సాయితేజ్ విరూపాక్ష చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడని మెగా అభిమానులు సహా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో సాయితేజ్ సక్సెస్‌ని మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇప్పటికే చిరంజీవి విరూపాక్ష టీంకు అభినందనలు తెలుపగా తాజాగా రామ్‌చరణ్ ట్వీట్ చేశారు. 'కంగ్రాట్స్.. మై బ్రదర్(సాయితేజ్). విరూపాక్ష సినిమా గురించి చాలా మంచి టాక్ వింటున్నా' అంటూ చరణ్ పేర్కొన్నాడు.
Congratulations brother @IamSaiDharamTej hearing great things about #Virupaksha 😊 @karthikdandu86@iamsamyuktha_ @BvsnP @SVCCofficial @Shamdatdop @bkrsatish @SukumarWritings pic.twitter.com/PIH235uYxM
— Ram Charan (@AlwaysRamCharan) April 22, 2023