Sehari: harsh Kanumilli And Simran Choudhary Movie Trailer Out Video Viral - Sakshi
Sakshi News home page

Sehari: సెహరి ట్రైలర్‌ చూశారా?

Feb 2 2022 12:15 PM | Updated on Feb 2 2022 1:09 PM

Harsh Kanumilli, Simran Choudhary Sehari Trailer Out - Sakshi

'సెహరి అంటే ఏంటి భయ్యా? సెహరి అంటే సెలబ్రేషన్స్‌', 'నీ ముఖానికి పెళ్లవడమే ఎక్కువ', 'ఆలియాను చేసుకోమంటే అక్కను తగులుకున్నావేంట్రా' వంటి డైలాగులు బాగున్నాయి...

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం సెహరి. ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ నుంచి బుధవారం(ఫిబ్రవరి 2) ట్రైలర్‌ రిలీజైంది. 'సెహరి అంటే ఏంటి భయ్యా? సెహరి అంటే సెలబ్రేషన్స్‌', 'నీ ముఖానికి పెళ్లవడమే ఎక్కువ', 'ఆలియాను చేసుకోమంటే అక్కను తగులుకున్నావేంట్రా' వంటి డైలాగులు బాగున్నాయి.

హీరో పార్ట్‌నర్‌ కోసం వెతకడం, ఎంగేజ్‌మెంట్‌ నుంచి పారిపోవడం... వంటి సన్నివేశాలు ఆసక్తికి కలిగిస్తున్నాయి.  యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్‌ విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరిజాలా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో అభినవ్​ గౌతమ్​ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే అప్పట్లో ఈ సినిమా ఫస్ట్ లుక్​ను నటసింహం నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో హర్ష్​ కనుమిల్లిని వర్జిన్​ స్టార్​ అని బాలకృష్ణ అనడం వైరల్​ కూడా అయింది.

Advertisement
 
Advertisement
Advertisement