భార్యకు జెర్సీ నటుడు స్పెషల్ విషెస్.. వీడియో రిలీజ్! | Sakshi
Sakshi News home page

Harish Kalyan: పెళ్లి రోజును గుర్తు చేసుకున్న జెర్సీ నటుడు.. స్పెషల్ వీడియో వైరల్!

Published Sun, Oct 29 2023 6:22 PM

Harish Kalyan and Narmada first wedding anniversary - Sakshi

సింధు సమవేలి అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యువ హీరో హరీశ్ కల్యాణ్. ఆ తర్వాత తమిళంతో పాటు  తెలుగు చిత్రాల్లోనూ నటించారు. కాదలి, జైశ్రీరామ్, నాని జెర్సీ లాంటి టాలీవుడ్ చిత్రాల్లో కనిపించారు. ఇటీవలే విడుదలైన ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కించిన ఎల్‌జీఎం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. అయితే గతేడాదే హరీష్ కల్యాణ్ వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. నర్మద అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు.  చెన్నైలో జరిగిన వీరి పెళ్లికి కోలీవుడ్ సినీతారలు, ప్రముఖులు సైతం హాజరయ్యారు. 

తాజాగా హరీశ్ కల్యాణ్ దంపతులు తమ మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య నర్మద పట్ల ప్రేమను చాటుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. తన భార్యతో కలిసి ఉన్న ఆనందకరమైన క్షణాలను పంచుకుంటూ స్పెషల్ విషెస్ తెలిపారు. ఒకవైపు సినిమాలతో పాటు బిజీగా ఉంటూ.. మరోవైపు పర్సనల్ లైఫ్‌ బ్యాలెన్స్ చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం హరీశ్ కల్యాణ్ నటిస్తోన్న నూరు కోడి వానవిల్, డీజిల్ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. అనంతరం మరో ప్రయోగాత్మక చిత్రంలో కూడా నటించనున్నట్లు సమాచారం.
 

 
Advertisement
 

తప్పక చదవండి

Advertisement