శాపానికి గురైతే... | Happy Ending Movie Teaser Launch Event | Sakshi
Sakshi News home page

శాపానికి గురైతే...

May 14 2023 5:54 AM | Updated on May 14 2023 5:54 AM

Happy Ending Movie Teaser Launch Event - Sakshi

కౌశిక్, యశ్, అపూర్వ రావు, అనిల్‌ పల్లాల

యశ్‌ పూరి, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’. కౌశిక్‌ భీమిడి దర్శకత్వంలో సిల్లీ మాంక్స్, హామ్స్‌ టెక్‌ ఫిల్మ్స్‌ పతాకాలపై అనిల్‌ పల్లాల నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం  రిలీజ్‌ చేశారు. ‘‘నా నిగ్రహాన్ని పరీక్షించుకోవడానికి వస్తే నా పరువు తీస్తావా. ఇక నీకు మిగిలింది నిగ్రహమే’, ‘బాబా శాపం ఇచ్చాడా?’ అనే డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి.

టీజర్‌ రిలీజ్‌ సందర్భంగా హీరో యశ్‌ మాట్లాడుతూ– ‘‘ఇది నాకు మూడో సినిమా. పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథే ఈ చిత్రం’’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్‌ టైనింగ్‌ ఫిల్మ్‌ ఇది’’ అన్నారు కౌశిక్‌. ‘‘సినిమా బాగా వచ్చింది. ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు అనిల్‌. ‘‘ఒంగోలులో పుట్టి గుజరాత్, గల్ఫ్‌లో పెరిగాను. స్టడీస్‌ తర్వాత హైదరాబాద్‌ వచ్చాను. ఇది నా తొలి చిత్రం’’ అన్నారు అపూర్వ. ‘‘ఈ జనరేషన్‌లోని అబ్బాయి ఓ బాబా శాపానికి గురైతే అతని పరిస్థితి ఏంటి? అన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు కెమెరామేన్‌ అశోక్‌.

Advertisement
 
Advertisement
Advertisement