Hansika Motwani Wears Red Sari For Mata Ki Chowki For Wedding With Sohael Khaturiya - Sakshi
Sakshi News home page

Hansika Motwani: పెళ్లికూతురిలా ముస్తాబైన హన్సిక.. పిక్స్ వైరల్..!

Nov 22 2022 9:27 PM | Updated on Nov 23 2022 8:48 AM

Hansika Motwani wears red sari for Mata Ki Chowki for wedding with Sohael Khaturiya  - Sakshi

హీరోయిన్‌ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా  ప్రకటించింది. సోహాల్‌ కతూరియా అనే వ్యాపారవేత్తతో డిసెంబర్‌ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. రాజస్తాన్‌లోని  జైపూర్‌లోని ప్రాచీన ప్యాలెస్‌ వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. పెళ్లికి రెండు రోజుల ముందు మోహిందీ, సంగీత్‌ వంటి కార్యక్రమాలు ఓటీటీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 

(చదవండి: హన్సిక మ్యారేజ్ అప్‌ డేట్.. ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం..!)

తాజాగా హన్సిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. హన్సిక మోత్వానీ సోహెల్ ఖతురియాతో పెళ్లికి ముందు వధువులా ముస్తాబై ఎరుపు చీరలో కనిపించింది.  వివాహ వేడుకలో భాగంగా జరిగే'మాతా కీ చౌకీ' కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంతో ఈరోజు వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం కాబోయే వధువు హన్సిక ఎరుపు రంగు చీర ధరించి కారులో పూజకు వెళ్తండగా కెమెరాకు చిక్కింది. ముంబైలో జరుగుతున్న ఈ వేడుకలో హన్సిక మోత్వాని ఎరుపు రంగు చీరలో అచ్చం వధువులా తయారైంది. మాతా కీ చౌకీ తర్వాత డిసెంబర్ 2న సూఫీ నైట్, డిసెంబర్ 3న మెహందీ, సంగీత వేడుకలు జరుగునున్నాయి. వీటితో పాటు, పోలో మ్యాచ్, క్యాసినోతో కూడిన పార్టీ కూడా జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement