Hansika Motwani And Sohail Kathuria Marriage Will Be Live On OTT Platform, Deets Inside - Sakshi
Sakshi News home page

Hansika Motwani Marriage: జైపూర్‌ కోటలో హన్సిక పెళ్లి వేడుక.. ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం..!

Nov 13 2022 4:06 PM | Updated on Nov 13 2022 6:01 PM

Hansika Motwani Marriage Will be Live On OTT Platform - Sakshi

హీరోయిన్‌ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. సోహాల్‌ కతూరియా అనే వ్యాపారవేత్తతో చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్న హన్సిక డిసెంబర్‌ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. రాజస్తాన్‌లోని  జైపూర్‌లోని ప్రాచీన ప్యాలెస్‌ వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. పెళ్లికి రెండు రోజుల ముందు మోహిందీ, సంగీత్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా హన్సిక పెళ్లిపై ఓ వార్త వైరలవుతోంది. హన్సిక వివాహా వేడుకను ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. 

(చదవండి: కాబోయే భర్తతో హన్సిక పర్సనల్‌ ఫొటో లీక్‌.. స్పందించిన హీరోయిన్‌)

అయితే యాపిల్ బ్యూటీ వివాహానికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొంతమంది సన్నిహితులు, వీరిద్దరి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. డిసెంబర్ 2వ తేదీన సూఫీ, 3వ తేదీన మెహందీ, సంగీత వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 4వ తేదీ పెళ్లి వేడుక సందర్భంగా క్యాసినో నేపథ్యంతో కూడిన పార్టీని కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement