నాపై ఆ రూమర్స్.. అమ్మ చాలా బాధపడింది: హన్సిక | Sakshi
Sakshi News home page

Hansika: షాకింగ్ రూమర్స్.. అసలు సంగతి చెప్పిన హన్సిక

Published Sun, Oct 1 2023 5:00 PM

Hansika Comments Injections Rumours Mother Disturbed With It - Sakshi

హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా ఇప్పటికే 50 సినిమాల మార్క్ దాటేసింది. దక్షిణాదితో పాటు హిందీలోనూ నటించింది. అయితే ఈమె పెళ్లి టైంలో కొన్ని రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. వాటి వల్ల తన తల్లి ఎలా బాధపడిందో కూడా చెప్పుకొచ్చింది.

ఏంటా రూమర్స్?
ముంబయికి చెందిన హన్సిక.. పలు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2003లో రిలీజైన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లోనూ యాక్ట్ చేసింది. కట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత 2007లో 'దేశముదురు' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల గ్యాప్‌లో హన్సిక మార్పు చూసి, త్వరగా ఎదిగేందుకు ఆమె ఇంజెక్షన్స్ తీసుకుందని కొందరు కామెంట్స్ చేశారు.

(ఇదీ చదవండి: 'భీమ్లా నాయక్' నటి విడాకులు? పెళ్లయి ఏడాది తిరగకుండానే!)

పెళ్లి టైంలో అలా
దాదాపు 20 ఏళ్లుగా హన్సిక సినిమాలు చేస్తోంది. గతేడాది డిసెంబరులో ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. సరిగ్గా ఆ సమయంలో హన్సిక.. అప్పట్లో ఎదగడానికి ఇంజెక్షన్స్ తీసుకుందనే పుకార్లు బాగా వైరల్ అయ్యాయి. దీనిపై హన్సిక తల్లి స్పందించింది. ఇప్పుడు ఈ రూమర్స్‌పై తన అభిప్రాయాన్ని హన్సిక చెప్పేసింది.

హన్సిక కామెంట్స్
'నేను ఇలాంటి రూమర్స్ అస్సలు పట్టించుకోను. కానీ మా అమ్మ మాత్రం చాలా బాధపడుంటుంది. కానీ నాకు ఆ బాధని ఎప్పుడూ చూపించలేదు. ఎందుకంటే నన్ను రక్షించేది ఆమెనే కదా. అయితే ప్రశంసలు వచ్చినప్పుడు నేను తీసుకున్నా. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కూడా అలానే తీసుకుంటా. వాటి విషయంలో నేను చాలా స్ట్రాంగ్ అయిపోయా' అని హన్సిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో మూడు, తమిళంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 7: ఊహించని సర్‌ప్రైజ్‌.. హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు!)

Advertisement
 
Advertisement