విడాకులపై ట్రోల్స్‌.. అంత దిగజారిపోయారా? అన్న నటుడు | GV Prakash Kumar reacts to trolling after separation announcement | Sakshi
Sakshi News home page

'విడాకులపై ట్రోల్స్‌.. అలా కామెంట్స్‌ చేయడం సరికాదు'

May 16 2024 3:18 PM | Updated on May 16 2024 3:49 PM

GV Prakash Kumar reacts to trolling after separation announcement

ఇటీవలే కోలీవుడ్‌ స్టార్‌ జీవీ ప్రకాశ్‌ కుమార్, అతని  భార్య, సింగర్‌ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చారు. ఈ సందర్భంగా తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ ప్రైవసీకి గౌరవించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ జంటపై పెద్ద  ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే దీనిపై జీవీ ప్రకాశ్‌ రియాక్ట్ అయ్యారు. తమ విడాకుల విషయంలో కొందరు విమర్శిస్తున్నారని అన్నారు. ఇద్దరు వ్యక్తులు కలవడం, విడిపోవడంపై సరైన అవగాహన లేకుండా ప్రజలు చర్చించుకోవడం మంచిది కాదు. సెలబ్రిటీలు అనే కారణంతో వ్యక్తిగత జీవితాలపై ఊహాగానాలు రావడం దురదృష్టకరం.. ఇవీ తమకు చాలా ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. 

ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించడం, వారి గురించి కామెంట్స్‌ చేయడం ఆమోదయోగ్యం కాదు. సోషల్ మీడియాలో ఇలాంటి ఊహాజనిత కథనాలు ఆ వ్యక్తులపై ప్రభావం చూపుతాయని గ్రహించలేనంతగా తమిళుల సద్గుణాలు దిగజారిపోయాయా?" ‍అని జీవీ ప్రకాశ్‌ ప్రశ్నించారు. దీనిపై తమిళంలో సుదీర్ఘమైన నోట్‌ను తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

జీవీ ప్రకాశ్‌ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మేము విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు తెలియజేశాం. అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. మా ఉద్దేశ్యంతో సంబంధం లేకుండా మీరు చేసే కామెంట్స్‌  బాధ కలిగించేవిగా ఉన్నాయని చెప్పడానికే ఈ పోస్ట్‌ చేస్తున్నా. దయచేసి అందరి భావోద్వేగాలను గౌరవించండి. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు.  కాగా.. జీవీ ప్రకాశ్, సైంధవి 11 ఏళ్ల తమ వివాబహాబంధానికి గుడ్‌ బై చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement