పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ | Gopichand Speech At Ramabanam Press Meet | Sakshi
Sakshi News home page

పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

Apr 27 2023 1:27 AM | Updated on Apr 27 2023 1:27 AM

Gopichand Speech At Ramabanam Press Meet - Sakshi

వివేక్‌ కూచిభొట్ల, గోపీచంద్, డింపుల్‌ హయతి, శ్రీవాస్‌

‘‘శ్రీవాస్‌గారితో ‘లక్ష్యం, లౌక్యం’ సినిమాలు చేశాను. మూడో సినిమాగా ‘రామబాణం’ చేద్దామనుకున్నప్పుడు ఆ రెండు సినిమాల్లా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలనుకున్నాం. అలాగే చేశాం. ‘రామబాణం’ వంటి మంచి సినిమా తీసిన విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్లగార్లకు థ్యాంక్స్‌. అందరికీ మా సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్‌ అన్నారు. శ్రీవాస్‌ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్‌ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’.

టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శ్రీవాస్‌ మాట్లాడుతూ– ‘‘రామబాణం’ ఔట్‌పుట్‌ చూశాక నమ్మకంగా ఉన్నాం. ఇంటర్వెల్, క్లయిమాక్స్‌ హైలెట్‌ అవుతాయి. సెకండ్‌ హాఫ్‌లోని భావోద్వేగ సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతాయి’’ అన్నారు. ‘‘ఈ వేసవిలో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు సహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల.

Advertisement
 
Advertisement
Advertisement