చరిత్ర సృష్టించిన ఆర్ఆర్‌ఆర్... నాటు నాటు సాంగ్‌కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్!

దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రతి భారతీయుడు గర్వపడేలా ఒక్కో అడుగు వేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కైవసం చేసుకుని భారతీయుల సత్తా చాటింది.
ఆర్‌ఆర్‌ఆర్‌కు ప్రతిష్టాత్మక అవార్డను కైవసం చేసుకుంది. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్‌ను సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అందుకున్నారు. ‘నాటు నాటు’ పాటను చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. గతంలో ఈ అవార్డులు గెలుచుకున్న ఎన్నో సినిమాలు ఆస్కార్స్‌లోనూ సత్తా చాటాయి.
ఈ కేటగిరిలో మరో 4 మంది నామినీలపై నాటు నాటు గట్టి పోటీనే ఎదర్కొని ఈ అవార్డ్‌ని కైవసం చేసుకుంది. ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించడం, భవిష్యత్తులో మరిన్ని భారతీయ చిత్రాలకు మార్గం సుగమం చేస్తుందనే చెప్పాలి. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కైవసంతో, ఇక అందరి కళ్లు జనవరి 24, 2023న జరగనున్న అకాడమీ అవార్డ్స్ ఫైనల్ నామినేషన్ జాబితాపై పడింది.
We made ittt 🥹🔥🔥🔥
Congratulations @mmkeeravaani garu #RRRMovie #GoldenGlobes pic.twitter.com/TXNunSYr10— 𝑃𝑟𝑎𝑛𝑎𝑣𝑖 Ꮢ𐊢 (@Alwayspranu18) January 11, 2023
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు