ఇంట్రెస్టింగ్‌ లవ్‌ స్టోరీ 'గీతా సుబ్రహ్మణ్యం-3'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Geetha Subramanyam 3 Set To Premiere On Aha On May 5 - Sakshi
Sakshi News home page

రొమాంటిక్ కామెడీ సిరీస్‌ 'గీతా సుబ్రహ్మణ్యం-3'.. స్ట్రీమింగ్‌ అప్పటినుంచే!

Apr 20 2023 9:25 PM | Updated on Apr 21 2023 10:03 AM

Geetha Subrahmanyam season 3 Streaming on May 5th on Aha - Sakshi

గీతా సుబ్రహ్మణ్యం ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్‌ ఫుల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రేమ కథలో సుప్రజ్ రంగా సుబ్రహ్మణ్యంగా కనిపించగా.. అభిజ్ఞ్య ఉతలూరు గీతగా నటించారు. ప్రేమలో ఉండే చిన్న పాటి గొడవలు ఎంతో ఫన్నీగా చూపించారు. ఎనిమిది ఎపిసోడ్‌లతో గీతాసుబ్రహ్మణ్యం అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతోంది. తాజాగా గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్‌ ఆహాలో రిలీజ్ చేయనున్నారు. మే 5న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్‌ను టమడ మీడియా నిర్మిస్తోండగా.. శివ సాయి వర్దన్ దర్శకత్వం వహించారు.

అసలు కథేంటంటే..

గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్ గీతా, సుబ్బుల మధ్య నడుస్తుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ బిజీ లైఫ్‌ను గడుపుతుంటారు. ఒక ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరినీ ఎంపిక చేయడం.. అందులో ఉద్యోగులు ఎలాంటి రిలేషన్ షిప్‌లో ఉండకూడదని కండీషన్ పెడతారు. కానీ ఆ కండీషన్‌ను గీతా, సుబ్బులు బ్రేక్ చేస్తారు. ప్రేమలో పడతారు. కానీ వారి ఫీలింగ్స్‌ను మిగతా ఉద్యోగుల ముందు బయట పెట్టకుండా మ్యానేజ్ చేస్తుంటారు. మే 5న ప్రేకక్షకులను అలరించేందుకు వస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement