Gautham Karthik and Manjima Mohan get married in Chennai - Sakshi
Sakshi News home page

Gautham Karthik and Manjima Mohan: వివాహబంధంలోకి అడుగుపెట్టిన ప్రేమజంట.. ఫోటోలు వైరల్

Nov 28 2022 12:33 PM | Updated on Nov 28 2022 1:15 PM

Gautham Karthik and Manjima Mohan get married Today - Sakshi

కోలీవుడ్‌ ప్రేమ జంట మంజిమా మోహన్- గౌతమ్‌ కార్తిక్‌ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇవాళ వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యుల అనుమతితోనే పెళ్లి చేసుకుంది ఈ జంట. చెన్నైలోని ఓ హోటల్‌లో వైభవంగా జరిగిన పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు, సన్నిహితుల హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు యువ జంటను ఆశీర్వదించారు. వెడ్డింగ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఫోటోను వధువు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొత్త జంటకు అభిమానులు కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

(చదవండి: హీరోతో డేటింగ్‌, పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్స్‌ డిలీట్‌ చేసిన మంజిమా మోహన్‌)

 దేవరట్టం  అనే తమిళ సినిమాతో మంజిమా మోహన్ - గౌతమ్‌ కార్తీక్ కలిసి పనిచేశారు. అదే సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తనే మొదట మంజిమాకు ప్రపోజ్‌ చేశానని ఇటీవలే గౌతమ్‌ వెల్లడించారు. దాదాపు మూడేళ్లుగా ప్రేమగా మునిగితేలిన ఈ జంట ఇవాళ ఒక్కటైంది. ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో మంజిమ, ‘కడలి’తో గౌతమ్‌  టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement