OTT: ‘గ్యాంగర్స్’మూవీ రివ్యూ | Gangers Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Gangers Movie Review: 100 కోట్లపై కన్ను.. వీళ్ళు మాములు టీచర్లు కాదు!

Jun 22 2025 8:03 AM | Updated on Jun 22 2025 8:04 AM

Gangers Movie Review In Telugu

తమిళనాట సుందర్.సి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తుంటారు. ఆయన కథల్లో సామాన్యులు కూడా అనితరసాథ్యమైన ఫీట్లు చేస్తుంటారు. అలానే కథలు రాసుకుంటారు సుందర్.సి. అదే కోవలో తీసుకువచ్చిన మరో యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గ్యాంగర్స్(Gangers Movie Review ). ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ లో కూడా లభ్యమవుతోంది. సుందర్.సి ఈ కథను తానే రాసుకుని, అదే కథకు తాను నిర్మాతగా కూడా వ్యవహరించి దర్శకత్వం కూడా తానే చేశారు.  

అరసన్ హైస్కూల్‌లో కంప్యూటర్ సైన్స్ టీచర్ సుజి తన స్టూడెంట్  రమ్య కనబడకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రారంభమయ్యే ఈ సినిమా ఒక ఉత్కంఠభరిత యాక్షన్ థ్రిల్లర్. సుజి స్కూల్ కరస్పాండెంట్ మలైయరసన్ అలాగే  అతని సోదరుడు కొట్టైయరసన్‌లపై రమ్య గురించి చేసిన ఆరోపణలతో కథ ఊపందుకుంటుంది. ఈ ఫిర్యాదు తరువాత దానిని విచారణ చేయడానకి ఓ రహస్య అధికారిగా  శరవణన్ PT టీచర్‌గా  ఆ స్కూల్ లో కి వస్తాడు. శరవణన్ ఆ స్కూల్ లోకి వచ్చీ రాగానే స్కూల్ లో స్టూడెంట్స్ తీసుకుంటున్న మత్తుపదార్ధాల బండారాన్ని బయట పెట్టడంతో పాటు  రమ్య కేసును కూడా విచారిస్తుంటాడు.

రమ్య కనబడకుండా పోవడానికి కారణం ఈ ఊరి డాన్ అయిన  ముదియరసన్ అని శరవణన్ తెలుసుకుంటాడు. అంతేకాదు ఆ ఊరిలో అక్రమంగా ముదియరసన్ దాదాపు 100 కోట్లకు పైగా డబ్బులు దాచి పెట్టాడని శరవణన్ కు తెలుస్తుంది. తన తోటి టీచర్లతో కలిసి ఆ డబ్బును కొట్టేయడానికి ప్లాన్ వేస్తాడు శరవణన్. మరి ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది మాత్రం గ్యాంగర్స్ సినిమాలోనే చూడాలి. సాధారణ టీచర్లు 100 కోట్ల రూపాయలను ఓ డాన్ దగ్గర నుండి కొట్టేయాలని ఏం చేస్తారు అన్నదే ఈ సినిమాలో సూపర్ పాయింట్. సినిమా ఆద్యంతం యాక్షన్ కామెడీతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వర్ధమాన తమిళ హాస్య నటుడు వడివేలు పండించిన కామెడీ ఈ సినిమాకు హైలైట్. ఓవరాల్ గా ఈ సినిమా వీకెండ్ కు మంచి కాలక్షేపం.
- హరికృష్ణ ఇంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement