breaking news
Sunder.C
-
OTT: ‘గ్యాంగర్స్’మూవీ రివ్యూ
తమిళనాట సుందర్.సి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తుంటారు. ఆయన కథల్లో సామాన్యులు కూడా అనితరసాథ్యమైన ఫీట్లు చేస్తుంటారు. అలానే కథలు రాసుకుంటారు సుందర్.సి. అదే కోవలో తీసుకువచ్చిన మరో యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గ్యాంగర్స్(Gangers Movie Review ). ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ లో కూడా లభ్యమవుతోంది. సుందర్.సి ఈ కథను తానే రాసుకుని, అదే కథకు తాను నిర్మాతగా కూడా వ్యవహరించి దర్శకత్వం కూడా తానే చేశారు. అరసన్ హైస్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్ సుజి తన స్టూడెంట్ రమ్య కనబడకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రారంభమయ్యే ఈ సినిమా ఒక ఉత్కంఠభరిత యాక్షన్ థ్రిల్లర్. సుజి స్కూల్ కరస్పాండెంట్ మలైయరసన్ అలాగే అతని సోదరుడు కొట్టైయరసన్లపై రమ్య గురించి చేసిన ఆరోపణలతో కథ ఊపందుకుంటుంది. ఈ ఫిర్యాదు తరువాత దానిని విచారణ చేయడానకి ఓ రహస్య అధికారిగా శరవణన్ PT టీచర్‌గా ఆ స్కూల్ లో కి వస్తాడు. శరవణన్ ఆ స్కూల్ లోకి వచ్చీ రాగానే స్కూల్ లో స్టూడెంట్స్ తీసుకుంటున్న మత్తుపదార్ధాల బండారాన్ని బయట పెట్టడంతో పాటు రమ్య కేసును కూడా విచారిస్తుంటాడు.రమ్య కనబడకుండా పోవడానికి కారణం ఈ ఊరి డాన్ అయిన ముదియరసన్ అని శరవణన్ తెలుసుకుంటాడు. అంతేకాదు ఆ ఊరిలో అక్రమంగా ముదియరసన్ దాదాపు 100 కోట్లకు పైగా డబ్బులు దాచి పెట్టాడని శరవణన్ కు తెలుస్తుంది. తన తోటి టీచర్లతో కలిసి ఆ డబ్బును కొట్టేయడానికి ప్లాన్ వేస్తాడు శరవణన్. మరి ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది మాత్రం గ్యాంగర్స్ సినిమాలోనే చూడాలి. సాధారణ టీచర్లు 100 కోట్ల రూపాయలను ఓ డాన్ దగ్గర నుండి కొట్టేయాలని ఏం చేస్తారు అన్నదే ఈ సినిమాలో సూపర్ పాయింట్. సినిమా ఆద్యంతం యాక్షన్ కామెడీతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వర్ధమాన తమిళ హాస్య నటుడు వడివేలు పండించిన కామెడీ ఈ సినిమాకు హైలైట్. ఓవరాల్ గా ఈ సినిమా వీకెండ్ కు మంచి కాలక్షేపం.- హరికృష్ణ ఇంటూరు -
మిల్కీ బ్యూటీకి మరో భారీ చాన్స్
సాక్షి, తమిళసినిమా : బాహుబలి చిత్రంలో అవంతికగా విజృంభించిన మిల్కీ బ్యూటీ తమన్నాకు.. ఆ తరువాత కోలీవుడ్‌లో సరైన అవకాశాలు రాలేదు. ఇక, శింబుతో రొమాన్స్ చేసిన ‘అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా శీనూరామస్వామి దర్శకత్వంలో కన్నె కలైమానే చిత్రంలో నటించినా.. అది ఇంకా విడుదలకు నోచుకోలేదు. దీంతో ఈ అమ్మడు ఐటమ్ సాంగులకు సై అంటోందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో తమన్నా చెప్పే వెర్షన్ వేరేవిధంగా ఉంది. డాన్స్ అంటే తనకు ఇష్టమని, అందుకే ఐటమ్ సాంగ్స్ అవకాశాలను వదులుకోవడం లేదన్నది ఆమె అంటోంది. ఏదేమైనా కోలీవుడ్‌లో తమన్నా పనైపోయిందనే ప్రచారం సాగింది. అలాంటి తరుణంలో ఈ మిల్కీబ్యూటీని భారీ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు సుందర్.సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఈ భామకు నటించే అవకాశం దక్కింది. శింబు హీరోగా పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ని సుందర్ ప్రస్తుతం రీమేక్ చేస్తున్నారు. ఇందులో శింబుకు జంటగా మేఘా ఆకాశ్ నటించనుంది. ఈ చిత్రం తరువాత సుందర్ విశాల్ హీరోగా ఒక చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంలో విశాల్‌తో జోడీ కట్టే అవకాశం తమన్నాకు దక్కింది. ఈ విషయమై తమన్నా స్పందిస్తూ.. మొదటినుంచి సుందర్ సీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ కథాచిత్రమని, ఇందులో తన పాత్ర కూడా యాక్షన్ సీన్లలో నటించాల్సి ఉంటుందని తెలిపింది. ఇంతకుముందు ఈ అమ్మడు ‘కత్తిసండై’ చిత్రంలో విశాల్‌తో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక కీలక పాత్రను పోషిస్తోంది. -
11 దేశాలలో 'సంఘమిత్ర' షూటింగ్
బాహుబలి, కబాలి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతీయ సినిమా మరో రికార్డు సృష్టించనుంది. 11 దేశాలలో చిత్రీకరణకు సిద్ధమవుతూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన సుందర్.సి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని సినీలోకం ఎదురుచూస్తోంది. గొప్ప చారిత్రాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి 'సంఘమిత్ర' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. హీరోగా లీడింగ్ స్టార్లు మహేష్ బాబు, సూర్య, విజయ్‌ల పేర్లు లిస్ట్‌లో ఉన్నట్లు, వాళ్లను అప్రోచ్ అయినట్లు సుందర్ చెబుతున్నాడు. అయితే ఈ ముగ్గురిలో ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. ఇండియాతో పాటు అమెరికా, డెన్మార్క్, ఉక్రెయిన్, ఇరాన్ తదితర 11 దేశాలలో ఈ సినిమాను చిత్రీకరించనున్నారు. ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తారు. 11 దేశాలలో షూటింగ్ జరుపుకోనున్న అత్యంత ఖరీదైన భారతీయ సినిమాగా 'సంఘమిత్ర' నిలవనుంది.