‘గాంఢీవధారి అర్జున’ టీజర్‌ వచ్చేస్తుంది

Gandeevadhari Arjuna released on 25 august 2023 - Sakshi

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ఈ చిత్రంలో సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటించారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి.

ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 24న రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు వరుణ్‌ తేజ్‌. ఇందులో అర్జున్‌ అనే సెక్యూరిటీ ఆఫీసర్‌గా వరుణ్‌ తేజ్‌ నటించారని, ఓ విపత్తు నుంచి ప్రజలను రక్షించేందుకు అర్జున్‌ ఎటువంటి సాహసాలు చేశాడు? అనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top