సిటాడెల్.. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ అవుట్.. సమంత ఇలాంటి రోల్ చేస్తుందా?

బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈమె నటించిన లేటెస్ట్ హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్. రుస్సో బ్రదర్స్ ఏజీబీఓ సంస్థ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ భారీ యాక్షన్ సన్నివేశాలతో, స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపొందింది. నటి ప్రియాంకా చోప్రాతో పాటు స్టాన్లీ మూసీ, లెస్లీమాన్వల్లే, రిచర్డ్ మాడాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గ్రేమ్యాన్ చిత్రం తర్వాత రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ఇది. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. ఏప్రిల్ 28వ తేదీన 2 ఎపిసోడ్లను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత వరుసగా 26వ తేదీ వరకు వారానికి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తామని పేర్కొంది. 240కు పైగా దేశాల్లో ఆయా ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తున్నామంది. కాగా, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నటి ప్రియాంకా చోప్రా గన్ పట్టుకొని ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్లు ఉంది. ఈ సిటాడాల్ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ వెబ్ సిరీస్‌ను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో నటి సమంత.. ప్రియాంక చోప్రా పాత్రలో నటిస్తుండడం గమనార్హం. ఇక ప్రియాంక ఫస్ట్ లుక్ చూసిన అభిమానులు సామ్ ఇలాంటి రోల్ చేస్తుందా? తన లుక్ ఎలా ఉండబోతుందో అని కామెంట్లు చేస్తున్నారు.
do you C what’s hiding in front of your eyes?
the first look at @CitadelOnPrime starring @_richardmadden, @priyankachopra, Stanley Tucci, and Lesley Manville#CitadelOnPrime, Apr 28 pic.twitter.com/baT5fgKFm8— prime video IN (@PrimeVideoIN) February 27, 2023
— prime video IN (@PrimeVideoIN) February 27, 2023
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు