ఓటీటీలో ఫస్ట్ డే ఫస్ట్ షో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..? | First Day First Show Movie OTT Date Released | Sakshi
Sakshi News home page

First Day First Show In OTT: ఓటీటీలో ఫస్ట్ డే ఫస్ట్ షో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Published Thu, Sep 15 2022 12:06 PM | Last Updated on Thu, Sep 15 2022 1:58 PM

First Day First Show Movie OTT Date released  - Sakshi

'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. శ్రీకాంత్ రెడ్డి ,సంచిత బాషు జంటగా నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్  సమకూర్చారు. 

(చదవండి: First Day First Show Trailer: ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో ట్రైలర్‌ చూశారా?)

తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్‌ కానున‍్నట్లు శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట‍్స్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఈ మూవీలో ప్రధానంగా పవన్ కల్యాణ్ 'ఖుషీ' సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు టికెట్స్ హీరో ఎలా సంపాదించాడనే అంశంపైనే కథను రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ అంచనాలు పెంచినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఈ  సినిమాలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement