ఫిలింనగర్‌ షూటింగ్‌ సెట్‌లో అగ్ని ప్రమాదం | Fire Accident At Hyderabad Film Nagar Shooting Set | Sakshi
Sakshi News home page

ఫిలింనగర్‌ షూటింగ్‌ సెట్‌లో అగ్ని ప్రమాదం

Aug 12 2021 10:22 AM | Updated on Aug 12 2021 10:34 AM

Fire Accident At Hyderabad Film Nagar Shooting Set - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఓ సినిమా షూటింగ్‌లో సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించిన కారు జనరేటర్‌ నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జనరేటర్‌ నుంచి డీజిల్‌ లీక్‌ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆ జనరేటర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి పక్కన ఉన్న షాపులకు, మరో కారు ఈ మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో హొండా ఐ20 కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం భారీ జరిగినట్లు తెలుస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement