31 వరకు సినీ, టీవీ షూటింగ్స్‌ రద్దు.. అజిత్‌ 10 లక్షలు విరాళం | Film And TV Shootings To Be Suspended Till May 31 Says FEFSI | Sakshi
Sakshi News home page

31 వరకు సినీ, టీవీ షూటింగ్స్‌ రద్దు.. అజిత్‌ 10 లక్షలు విరాళం

May 16 2021 6:22 PM | Updated on May 16 2021 6:38 PM

Film And TV Shootings To Be Suspended Till May 31 Says FEFSI - Sakshi

కార్మికులను ఆదుకోవడానికి ప్రముఖ నటీనటులు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు

సాక్షి, చెన్నై: ఈ  నెల 31వ తేదీ వరకు సినీ, టీవీ షూటింగులు నిర్వహించబోమని, కార్మికులను ప్రముఖ తారలు ఆదుకోవాలని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి పేర్కొన్నారు. కరోనా రెండో దశ ప్రాణాంతకంగా మారడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. దీంతో సినిమా పరిశ్రమ మరోసారి కష్టాల్లో పడింది. ముఖ్యంగా సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది.

ఆర్‌కే సెల్వమణి శనివారం వడపళని లోని ఫెఫ్సీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 18 టీవీ సీరియళ్ల షూటింగులు జరుగుతున్నాయని, వాటిని ఆదివారం నుంచి నిలిపి వేయనున్నట్టు పేర్కొన్నారు. కార్మికులను ఆదుకోవడానికి ప్రముఖ నటీనటులు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై నటుడు అజిత్‌ స్పందించి రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement