సస్పెన్స్‌.. థ్రిల్‌ | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌.. థ్రిల్‌

Published Thu, Feb 22 2024 12:56 AM

Fear Movie Vedhika Birthday Poster Released - Sakshi

‘కాంచన 3, రూలర్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్‌ వేదిక లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ఫియర్‌’. హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో అరవింద్‌ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్‌ అభి నిర్మించారు. కాగా బుధవారం (ఫిబ్రవరి 21) వేదిక పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఫియర్‌’. ఇందులో వేదిక క్యారెక్టర్‌ కొత్తగా ఉంటూ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయనుంది. ఆమె కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన చిత్రం అవుతుంది. ప్రస్తుతం ‘ఫియర్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, సహ నిర్మాతలు: సుజాత రెడ్డి, సామ సురేందర్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement