'భర్త కోరికలు తీర్చలేకపోయా.. అందుకే మరో అమ్మాయితో' | Famous Malaysian singer Ezlynn helps husband find young Wife | Sakshi
Sakshi News home page

Singer: 'భర్త కోసం సింగర్ షాకింగ్ నిర్ణయం.. ఏకంగా 26 ఏళ్ల అమ్మాయితో'

Published Mon, Apr 8 2024 7:10 PM | Last Updated on Mon, Apr 8 2024 7:40 PM

Famous Malaysian singer Ezlynn helps husband find young Wife - Sakshi

ఎవరైనా తన భర్త కోసం తమ లైఫ్‌లో కొన్నింటిని త్యాగం చేస్తారు. ఎంత బిజీ లైఫ్ ఉన్నప్పటికీ భార్య భర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినకుండా చూసుకుంటారు. కట్టుకున్న భర్త కోసం కొంత సమయమైనా కేటాయిస్తారు. ఇది సాధారణంగా ఎక్కడైనా జరిగేదే. కానీ ఓ సింగర్‌ తన భర్త కోసం చేసిన పని చూస్తే కచ్చితంగా షాకవ్వాల్సిందే. ఎందుకంటే తన భర్తకు సమయం కేటాయించలేకపోతున్నానంటూ బాధపడింది. అంతే కాకుండా తన భర్త కోసం ఏదో ఒకటి చేయాలనుకుంది. చివరికీ మరో అమ్మాయితో తన భర్తకు పెళ్లి చేసి ఆ లోటును తీర్చింది. ఇంతలా షాకింగ్‌ ఇచ్చిన ఆ సింగర్‌ కథేంటో తెలుసుకుందామా?    

ప్రముఖ మలేషియన్ సింగర్ అజ్లిన్ అరిఫిన్ తన భర్తకు రెండో పెళ్లి చేసి వార్తల్లో నిలిచింది. తన బిజీ కెరీర్ కారణంగా..  భర్త కోసం తగినంత టైం కేటాయించలేకపోయానని ఆమె తెలిపింది. అందుకే అతనికి కొత్త భాగస్వామిని తీసుకొచ్చానని సింగర్ వెల్లడించింది. ఆమె భర్త వాన్ ముహమ్మద్ హఫీజామ్ వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు కాగా.. 26 ఏళ్ల వైద్యురాలితో  పెళ్లి చేసింది. మార్చి రెండో వారంలో వివాహం జరిగినట్లు సమాచారం.

భర్తకు రెండో పెళ్లిపై అజ్లిన్ అరిఫిన్ మాట్లాడుతూ..'నా బిజీ లైఫ్‌లో భర్తను సరిగా చూసుకోలేకపోయా. అందువల్ల అతని కోరికలు తీర్చలేకపోతున్నా. అందుకే రెండో పెళ్లికి నేనే చొరవ తీసుకున్నా. ఈ వివాహం తర్వాత కూడా నేను అతనితో సంతోషంగా ఉన్నా. మేం ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటున్నాం. నేను అతనితో నా ఖాళీ సమయాన్ని గడుపుతున్నా'  అని అన్నారు. 

కాగా.. 42 ఏళ్ల అజ్లిన్ అరిఫిన్‌ ప్రతిరోజు తన వృత్తిలో భాగంగా వివిధ నగరాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో తన భర్త ఒంటరిగా ఉంటున్నాడని.. అతను ఒంటరితనం నుంచి బయటపడేందుకే తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని అజ్లిన్ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. అజ్లిన్‌ మొదట తన మేనేజర్ ఆడమ్ ఫామి అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరిద్దరూ 2011లో పెళ్లి చేసుకుని ఆరేళ్ల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత అస్లిన్ ఆధ్యాత్మికత వైపు మళ్లి నాలుగేళ్లపాటు సింగిల్ జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత వాన్ ముహమ్మద్ హఫీజామ్‌తో  2021లో  రెండో వివాహంజరిగింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement