'ఫ్యామిలీ స్టార్'గా విజయ్.. భార్యగా మృణాల్ | Vijay Devarakonda Family Star Telugu Movie Glimpse Out - Sakshi
Sakshi News home page

Family Star Movie: మిడిల్ క్లాస్ తండ్రిలా విజయ్.. 'ఫ్యామిలీ స్టార్' గ్లింప్స్ రిలీజ్

Oct 18 2023 7:59 PM | Updated on Oct 18 2023 8:04 PM

Family Star Movie Glimpse Telugu Vijay Devarakonda - Sakshi

గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు 'ఫ్యామిలీ స్టార్' టైటిల్ ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఓ గ్లింప్స్ వీడియోని బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. అయితే ఇప్పటివరకు చేసిన చిత్రాలతో పోలిస్తే విజయ్ డిఫరెంట్ లుక్‌లో మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో కనిపించడం విశేషం.

(ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి' సినిమా రిలీజ్‪‌కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?)

ఈ టీజర్‌లో.. ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీ మ్యాన్, బయట రౌడీల బెండు తీసే పవర్‌ఫుల్ మ్యాన్‌గా విజయ్ దేవరకొండ కనిపించారు. లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్‌కు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కు పంపించడాలు అనుకున్నావా మగతనం అంటే అని విలన్ ఎగతాళిగా మాట్లాడగా.. భలే మాట్లాడతారన్నా మీరంతా, ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా, పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా? ఐరెన్ వంచాలా ఏంటి? అని డైలాగ్స్‌తో విజయ్ ఆకట్టుకున్నాడు.

ఇక టీజర్ చివరలో విజయ్ భార్యగా మృణాల్ నటిస్తుందనే విషయాన్ని రివీల్ చేశారు. 'ఫ్యామిలీ స్టార్' వీడియో చూస్తుంటే మిడిల్ క్లాస్ ఎమోషన్స్ చూపిస్తూనే అక్కడక్కడ యాక్షన్ చూపిస్తారనిపిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

(ఇదీ చదవండి: పులివెందులలో 'యాత్ర 2'... పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement