ఏదైనా సినిమా బాగుందంటే చాలు దాని కొనసాగింపు కోసం జనం ఎదురుచూస్తుంటారు. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలు కూడా అలాంటి బజ్ క్రియేట్ చేసుకుని సీక్వెల్‌లో కూడా కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ధురంధర్ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.
ధురంధర్ బ్లాక్‌బస్టర్
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ 2025 డిసెంబర్‌లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూసేందుకు జనం థియేటర్ల ఎదుట క్యూ కట్టారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. దీంతో దీని సీక్వెల్ కోసం జనం వెయిట్ చేశారు.
ధురంధర్ 3 రాబోతోందా?
అయితే వారిని మరీ ఎక్కువ ఎదురుచూడనివ్వకుండా మూడు నెలల్లో ధురంధర్ 2ని తీసుకొచ్చారు మేకర్స్. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. నాలుగు రోజుల్లోనే రూ.761 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 3 రాబోతోందని ప్రచారం మొదలైంది.
ఫేక్ ఫోటో
అది కూడా మరో మూడు నెలల్లోనే విడుదల కాబోతుందని రూమర్ సృష్టించారు. జూన్ 14న ధురంధర్: ద ఫైనల్ చాప్టర్ రాబోతుందంటూ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది, అది నెట్టింట వైరల్‌గా మారగా అది నిజమని చాలామంది భ్రమపడుతున్నారు.
సినిమా
సినిమా చివర్లో పేర్లు పడి ఆగిపోయేంతవరకు మీరు సీటులో నుంచి లేవొద్దు అని ఆదిత్య ధర్ ప్రేక్షకులకు సూచించాడు. ఆ లెక్కన నిజంగానే చివరాఖరులో మూడో భాగం కోసం ప్రకటించారేమోనని పలువురూ భావించారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. ఇప్పటివరకు చిత్రయూనిట్ మూడో భాగం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి అదంతా ఫేక్ న్యూస్ అని అర్థమవుతోంది.
Is This For Real ? 3 Parts #Dhurandhar The Final Chapter on 14 June 2026 pic.twitter.com/EqAINSzpxN
— INDIAN (@hindus47) March 18, 2026


