
విఘ్నేష్, గుణశేఖర్, నీలిమ గుణ, కాల భైరవ, పృథ్వీ
‘‘నేను ఏ సినిమా చేసినా ఒకే జానర్, ఒకే బ్యాక్‌డ్రాప్‌లో ఉండవు. అలా గతంలో చిరంజీవిగారితో ‘చూడాలని ఉంది’, ఎన్టీఆర్‌తో ‘రామాయణం’, మహేశ్‌బాబుతో ‘ఒక్కడు’ లాంటి కొత్త ప్రయత్నాలు చేస్తే ప్రేక్షకులు ఆశీర్వదించారు. ఇప్పుడు ఈ ‘యుఫోరియా’(Euphoria) కథను నేను, నా ఫ్యామిలీ నమ్మాం. అందుకే ఈ సినిమా తీశాను. ప్రేక్షకులను మా చిత్రం మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు.
గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మించిన చిత్రం ‘యుఫోరియా’. నూతన నటీనటులతోపాటు ప్రముఖ తారలు భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్ తదితరులు ముఖ్యపాత్రలుపోషించారు. ఈ చిత్రంలోని ‘ఫ్లై హై...’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేశారు. కాల భైరవ స్వరపరచిన ఈపాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. కాల భైరవ, పృథ్వీ చంద్ర, గాయత్రీ నటరాజన్ ఆలపించారు. ఈపాట ఆవిష్కరణ కార్యక్రమంలో గుణశేఖర్ మాట్లాడుతూ – ‘‘ఈ ‘ఫ్లై హై’తోపాటు సినిమాలో ఉన్న మూడుపాటలూ వినూత్నంగా ఉంటాయి.
యూత్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా తీస్తున్నాను. కథ నచ్చి మా ఫ్యామిలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది’’ అని చె΄్పారు. ‘‘ఫ్లై హై’లాంటి మంచిపాట ఇచ్చిన కాల భైరవగారికి థాంక్స్’’ అని నీలిమ గుణ అన్నారు. ‘‘యుఫోరియా’ మూవీ డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే కొత్త రకం మ్యూజిక్ ఇవ్వడానికి ట్రై చేశాను’’ అన్నారు కాల భైరవ. ‘‘తక్కువ సమయంలో గుణశేఖర్‌లాంటి దర్శకుడితో పని చేసే అవకాశం రావడం హ్యాపీ’’ అని కొరియోగ్రాఫర్ ఈశ్వర్ తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో హీరోగా నటించిన విఘ్నేష్ గవిరెడ్డి, విలన్ పృథ్వీరాజ్ అడ్డాల కూడా మాట్లాడారు.