సినీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ | Essential Supply For Nadigar Sangam Members | Sakshi
Sakshi News home page

సినీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

May 19 2021 8:29 AM | Updated on May 19 2021 8:35 AM

Essential Supply For Nadigar Sangam Members - Sakshi

షూటింగ్‌లు రద్దు అవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నడిగర్‌ సంఘానికి చెందిన పేద సభ్యులకు ఎలాంటి సాయం అందని పరిస్థితి..

సాక్షి, చెన్నై: కరోనా మహమ్మారి సినీ కళాకారులను మరోసారి ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా షూటింగ్‌లు రద్దు అవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా నడిగర్‌ సంఘం ఎన్నికలు జరిగినా ఫలితాలు నిలిపివేయడంతో రెండేళ్లకు పైగా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. దీంతో ఆ సంఘానికి చెందిన పేద సభ్యులకు ఎలాంటి సాయం అందని పరిస్థితి. దీంతో సంఘం సమస్యను పరిష్కరించాల్సిందిగా విశాల్‌ ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా ఆ సంఘం మాజీ అధ్యక్షుడు నాజర్‌ కూడా సంఘం సభ్యులను ఆర్థికసాయంతో ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న సినీ, నాటక రంగ కళాకారులకు నడిగర్‌ సంఘం ట్రస్ట్‌ సభ్యుడు పూచి మురుగన్‌ సోమవారం బియ్యం, కాయగూరలు వంటి నిత్యావసర వస్తువులను అందించారు. సుమారు 300కు పైగా సంఘ సభ్యులు ఈ కరోనా సాయాన్ని అందుకున్నారు. పూచి మురుగన్‌తో పాటు నటి కోవై సరళ, నటుడు దాడి బాలాజీ పాల్గొన్నారు.  

చదవండి: తమిళనాడు: ఆ ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయి?

Advertisement
 
Advertisement
Advertisement