ఎక్కడికో ఈ అడుగు | Ekkadiko Ee Adugu First Look Launch | Sakshi
Sakshi News home page

ఎక్కడికో ఈ అడుగు

Jan 18 2021 12:46 AM | Updated on Jan 18 2021 2:29 AM

Ekkadiko Ee Adugu First Look Launch - Sakshi

‘ఎఫెక్ట్స్‌ రాజు’ గా చిత్ర పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’. గోపీకృష్ణ, ప్రియాంకా చౌదరి జంటగా నటించారు. స్కై లైన్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై అట్లూరి శ్రీనివాస్‌ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజు, శ్రీనివాస్‌ మాట్లాడుతూ–‘‘విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’. 

1990లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మా సినిమా కోసం 55 రోజులు రేయింబవళ్లు పని చేసిన యూనిట్‌కి ధన్యవాదాలు’’ అన్నారు. ఆర్తి రాజ్, జయప్రకాష్‌ (తమిళ్‌), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: దిలీప్‌ బండారి, కెమెరా: ఈశ్వర్‌ ఎల్లుమహంతి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తాతినేని సుజన్‌ బాబు.

Advertisement
 
Advertisement
Advertisement