ఎక్కడికో...

Ekkadiko Ee Adugu enters post-production stage - Sakshi

గోపీకృష్ణ, ప్రియాంకా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’. ‘ఎఫెక్ట్స్‌ రాజు’గా చిత్రపరిశ్రమకు సుపరిచితుడైన శ్రవణ్‌ బొనగాని దర్శకత్వంలో అట్లూరి శ్రీనివాస్‌ నిర్మించారు. ‘‘విభిన్న ప్రేమకథా చిత్రమిది. 1990లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్‌ బండారి, కెమెరా: ఈశ్వర్‌ ఎల్లుమహంతి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top