Salute Movie: సంక్రాంతి బరిలో మరో హీరో.. కలిసొచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' వాయిదా

Dulquer Salman Salute Movie Release In Sankranti Festival - Sakshi

Dulquer Salman Salute Movie Release In Sankranti Festival: దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న రౌద్రం రణం రుధిరం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. అయితే దేశంలో కరోనా, ఒమిక్రాన్‌ కేసుల నేపథ్యం, పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ, థియేటర్లు మూసివేయడం వంటి తదితర కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్‌ అయితే తమ చిత్రాలకు నష్టం కలుగుతుందని భావించి వాయిదా వేసుకున్న నిర్మాతలు ఉన్నారు. అయితే ఆర్‌ఆర్ఆర్‌ సినిమా వాయిదా అనేక చిత్రాలకు కలసివచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అందుబాటులో ఉండేసరికి తమ సినిమాలకు మార్గం సుగమం అయినట్లు భావించి విడుదలకు సిద్ధమవుతున్నారు మేకర్స్‌. 

ఈ క్రమంలో మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన కొత్త సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. దుల్కర్‌ సల్మాన్‌ నటించి సెల్యూట్‌ చిత్రాన్ని మలయాళంలో జనవరి 14న రిలీజ్‌ చేయనున్నట్లు ఇదీ వరకే ప్రకటించింది చిత్రబృందం. అయితే ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో థియేటర్లు అందుబాటులో ఉండటంతో తెలుగులోనూ అదే రోజున విడుదల చేస్టున్నట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రానికి రోషన్‌ ఆండ్రూస్‌ డైరెక్టర్‌. ఈ చిత్రంతో పాటు ఆది సాయి కుమార్‌ నటించిన 'అతిథి దేవోభవ' (జనవరి 7), సిద్దు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' (జనవరి 14), సూపర్ మచ్చి (జనవరి 14), మహేశ్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా 'హీరో' (జనవరి 15) తదితర సినిమాలు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. 

ఇదీ చదవండి: సల్మాన్‌ ఖాన్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌.. సిక్స్‌ ప్యాక్‌ ఫేక్ అని ట్రోలింగ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top