Dulquer Salmaan: ‘సోషల్‌ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు, ఆ స్క్రీన్‌ షాట్స్‌ తీసి పెట్టుకున్నా’

Dulquer Salmaan Said He Saves Screenshots of Criticism On Him - Sakshi

స్టార్‌ కిడ్‌ అయిన దుల్కర్‌ సల్మాన్‌ సైతం ట్రోల్స్‌ బారిన పడ్డాడట. తనని వ్యక్తిగతం టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో విమర్శించారని, వాటికి సంబంధించిన స్క్రిన్‌షాట్స్‌ కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. సీతారామంతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్న దుల్కర్‌ తాజాగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘చుప్‌: రివేంజ్‌ ఆఫ్‌ ది ఆర్టిస్ట్‌’. సెప్టెంబర్‌ 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లో భాగంగా దుల్కర్‌ మీడియాతో మాట్లాడుతూ పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌పై స్పందించాడు.

చదవండి: Sudheer Babu: అందుకే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఆఫర్‌ వదులుకున్నా

ఈ మేరకు దుల్కర్‌ మాట్లాడుతూ.. ‘గతంలో అభిషేక్‌ బచ్చన్‌ గురించి ఓ వార్త విన్నాను. ఆయనను విమర్శిస్తు రాసిన ఆర్టికల్‌కు సంబంధించిన పేపర్‌ కట్టింగ్స్‌ను అద్దంపై అతికించుకుంటారట. వాటిని రోజు చదువుతారని విన్నాను. నా విషయానికి వస్తే నేను కూడా అలాగే చేస్తాను. నా ఫోన్‌ గ్యాలరీ చూస్తే మీకు అన్ని స్క్రీన్‌షాట్స్‌యే కనిపిస్తాయి. సోషల్‌ మీడియాలో వ్యక్తిగతంగా నన్ను టార్గెట్‌ చేస్తూ చేసిన విమర్శల తాలుకు స్క్రిన్‌షాట్స్‌ అవి. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ ఇలా అన్నింటి స్క్రీన్‌ షాట్స్‌ సేవ్‌ చేసి పెట్టుకుంటాను. వాటిని అప్పుడప్పుడు చూస్తుంటా. అందులో నన్ను పర్సనల్‌గా అటాక్‌ చేసిన ఐడీలు కూడా నాకు బాగా గుర్తున్నాయి’ అని చెప్పాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top