Dulquer Salmaan: ‘సీతారామం’ సీక్వెల్‌ ఉంటుందా? దుల్కర్‌ ఏమన్నారంటే..

Dulquer Salmaan Response On Sita Ramam Movie Sequel - Sakshi

ఒక సినిమా హిట్‌ అయితే చాలు.. దాని సిక్వెల్‌ తీస్తున్నారు నేటి దర్శకనిర్మాతలు. బాహుబలి తర్వాత టాలీవుడ్‌లోనూ ఈ సీక్వెల్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా హిట్‌ సినిమాల కొనసాగింపుపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘సీతారామం’ మూవీకి కూడా సీక్వెల్‌ ఉంటే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్‌ దుల్కర్‌ సల్మాన్‌ వద్ద ప్రస్తావించగా.. సీక్వెల్‌పై ఆయన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

(చదవండి: మహేశ్‌-రాజమౌళి సినిమా: జక్కన్న భారీ స్కెచ్‌...హీరోయిన్‌ ఆమేనా?)

‘ఏదైనా ఒక సినిమాకి విశేష ప్రేక్షకాదారణ లభించి, క్లాసిక్‌గా నిలిస్తే దాన్ని మళ్లీ టచ్‌ చేయకూడదనే విషయాన్ని నేను నటుడిని కాకముందు నుంచే తెలుసుకున్నా. మేం కథను బాగా నమ్మాం. సీతారామం ఒక క్లాసిక్‌ మూవీగా నిలస్తుందని భావించాం. అనుకున్నట్లే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమ హృదయాల్లో దాచుకున్నారు. అందుకే ఈ చిత్రానికి కొనసాగింపు ఉండదనుకుంటున్నా’అని దుల్కర్‌ చెప్పుకొచ్చాడు. అలాగే రీమేక్‌ కూడా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. 

హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ అందమైన ప్రేమ కావ్యంలో మృణాళిక ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించగా, రష్మిక,తరుణ్‌ భాస్కర్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ఫ్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top