లవ్‌ డ్రిల్‌ 

Drill movie teaser release - Sakshi

‘‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అమెరికాలో డాక్టర్‌గా బిజీగా ఉన్నా సినిమాలపై ఇష్టంతో ‘కెప్టెన్‌ రాణా ప్రతాప్, టిక్‌ టిక్, చంద్రహాస్‌’ వంటి 8 సినిమాలు తీయడంతో పాటు నటించాను. అయితే తెలుగులో ఇప్పటివరకూ లవ్‌ జిహాదీపై ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ఆ కథాంశం ఎంచుకుని ‘డ్రిల్‌’ తీశా’’ అని హరనాథ్‌ పోలిచెర్ల అన్నారు.

ఆయన లీడ్‌ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డ్రిల్‌’. కారుణ్య చౌదరి హీరోయిన్‌. డ్రీమ్‌ టీమ్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న రిలీజవుతోంది. ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ వేడుకలో అతిథిగా పాల్గొన్న సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌... ‘‘అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడ్డ హరనాథ్‌గారు ఇండియా వచ్చి తెలుగు సినిమాలు తీయడం హ్యాపీ’’ అన్నారు.

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top