
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత జాన్ పాల్ నిర్మించిన లైవ్ యాక్షన్ ఫిక్షనల్ షార్ట్ ఫిల్మ్ ‘డొజో’కు అరుదైన గౌరవం దక్కింది. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అర్మిన్ అలిక్ (USA) దర్శకత్వంలో జాన్ పాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అంతర్జాతీయంగా 1200 ఫిల్మ్ అవార్డులను సాధించి, ఎక్కువ అవార్డులు పొందిన లైవ్ యాక్షన్ ఫిక్షనల్ షార్ట్ ఫిల్మ్‌గా రికార్డు సృష్టించింది.
విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఫౌండర్, సీఈఓ డాక్టర్ సత్యవోలు రాంబాబు మాట్లాడుతూ.. జాన్ పాల్ సమర్పించిన దరఖాస్తును విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ బృందం పరిశీలించి, ఈ చిత్రానికి వరల్డ్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా అందజేసినట్లు తెలిపారు. ఈ అరుదైన ఘనత సాధించినందుకు ‘డొజో’ బృందం హర్షం వ్యక్తం చేసింది.