కమర్షియల్ హంగులతో ‘డాక్టర్‌సాబ్‌’ | Doctor Saab Movie Shooting First Schedule Completed | Sakshi
Sakshi News home page

కమర్షియల్ హంగులతో ‘డాక్టర్‌సాబ్‌’

Sep 30 2021 6:35 PM | Updated on Sep 30 2021 6:35 PM

Doctor Saab Movie Shooting First Schedule Completed - Sakshi

ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ పై శోభన్ హీరోగా డి.ఎస్.బి దర్శకత్వంలో ఎస్.పి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డాక్టర్ సాబ్’. డాక్టర్స్ ఎదురుకునే పరిస్థితుల నేపథ్యంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమ్మ పండు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకుంది. ఈ సందర్బంగా నిర్మాత ఎస్‌.పి వివరాలు తెలియచేస్తూ .. నా ఫ్రెండ్, చిత్ర ద‌ర్శ‌కుడు డి.ఎస్‌.పి ఓ అద్భుతమైన క‌థ‌ను రెడీ చేశాడు. స్క్రిప్ట్ చాలా బాగా కుదిరింది. ఈ చిత్ర షూటింగ్ మొదటి షెడ్యూల్‌ను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశాం.

మరో షెడ్యూల్‌ను ఈ నెల 25నుంచి చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.  అతి త్వ‌ర‌లోనే మిగ‌తా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము . హీరో శోభ‌న్ ఫైట్స్‌, డాన్స్‌ల విష‌యంలో స్పెష‌ల్‌గా ట్రైనింగ్ తీసుకుని చాల క‌ష్ట‌ప‌డి చేస్తున్నాడు. డాక్టర్ అనేవాడు దేవుడు అని చెప్పే సినిమానే ఇది. ఇప్ప‌టికే మా సినిమా లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా వినాయ‌కుడిపై గ‌ణ‌పతి లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశాం. ఆ సాంగ్ కూడా బాగా పాపులార్ అయింది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న డాక్టర్ సాబ్ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుంది అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement